Tiktok: అమెరికాలో టిక్ టాక్ బంద్!
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికాలో తన సేవల్ని నిలిపివేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ నేరుగా యూజర్లకు తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపింది.
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికాలో తన సేవల్ని నిలిపివేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ నేరుగా యూజర్లకు తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపింది.
అమెరికాలో టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించేందుకు బైడెన్ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. అయితే ట్రంప్ మాత్రం.. తాను మళ్లీ అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌ను బ్యాన్ చేయనని స్పష్టం చేశారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను చైనా యజమాని విక్రయించకపోతే దానిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే బిల్లును యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. కంపెనీ ప్రస్తుత యాజమాన్య నిర్మాణాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ US చట్టసభ సభ్యులు ఈ చర్య తీసుకున్నారు.