Dharmasthala: ధర్మస్థల కేసులో మరో పెద్ద ట్విస్ట్..నాకసలు కూతురే లేదన్న అన్యన్య భట్ తల్లి

 ధర్మస్థల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సాక్షి నంటూ వచ్చిన ముసుగు వ్యక్తి మాట మార్చారు. ఇప్పుడు అనన్య భట్ తల్లి కూడా తనకు అసలు కూతురే లేదంటూ ట్విస్ట్ ఇస్తున్నారు. తన చేత ఇద్దరు ప్రముఖ వ్యక్తులు అబద్ధం చెప్పించారని తెలిపారు.

New Update
dharmasthala

కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాలు ఖననం చేశారంటూ సంచలన కేసు నమోదు అయింది. దీనికి తానే సాక్ష్యం అని..మృతదేహాలను చూపిస్తానంటూ భీయా అనే వ్యక్తి ముందుకు కూడా వచ్చారు. చెప్పినట్టుగానే పదహారు ప్రదేశాలకు తీసుకెళ్ళి తవ్వకాలు కూడా జరిపించారు. భీమా తీసుకెళ్ళిన ప్రతీ చోటా సిట్ అధికారులు తనిఖీలు చేశారు. అయితే ఒక్క చోట తప్ప మరెక్కడా మృతదేహాలు దొరకలేదు. దాంతో పాటూ ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకూ తానే ప్రత్యక్ష సాక్షి అంటూ వచ్చిన భీమా మాట మార్చారు. తాను చెప్పింది అంతా అబద్ధం అన్నారు. నా చేత కొందరు అది చెప్పించారని తెలిపారు. న్యాయస్థానంలో అర్జీ కూడా కావాలని తన చేత వేయించారని...పుర్రెను ఇచ్చింది కూడా వాళ్ళేనని చెప్పారు. తాను అసలు కర్ణాటకలోనే ఉండనని చెప్పుకొచ్చారు. 

మరో పెద్ద ట్విస్ట్..

భీమా దెబ్బకే సిట్ అధికారులకు తల తిరిగింది...ఇప్పుడు అతనికి తోడు..ధర్మస్థల అంశం తెరపైకి వచ్చిన తర్వాత తన కుమార్తె మిస్ అయిందంటూ వచ్చిన సుజాత అనే ఆమె కూడా ఇప్పుడు మాట మారుస్తున్నారు. 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన తన కుమార్తె అనన్య భట్ కన్పించకుండా పోయిందని సుజాత దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలా రోజుల క్రితం కూడా ఇలా ఫిర్యాదు చేశానని..కానీ అప్పట్లో పోలీసులు తనను పట్టించుకోలేదని చెప్పారు. దీంతో కన్నడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

అదంతా కల్పితం..

అయితే సుజాత నిన్న కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తాను చెప్పినదంతా అబద్ధమని..కట్టు కథ కల్పించి చెప్పానని చెప్పారు. నాకు అసలు అనన్య భట్ అనే పేరుతో కుమార్తె లేదని అంటున్నారు. ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించారని అన్నారు. అనన్య ఫోటోలు కూడా సృష్టించినవే..దానికి సబంధించిన వార్తలు అన్నీ కూడా అసత్య ప్రచారమేనని తెలిపారు. అయితే ఇలా చెప్పడానికి తాను ఏ డబ్బూ తీసుకోలేదని అంటున్నారు. మా తాతగారికి చెందిన కొంత భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు తీసుకున్నారు. మా అనుమతి లేకుండానే సంతకాలు చేయించుకున్నారు. దాన్ని పొందేందుకే తాను ఈ నాటకం అంతా ఆడానని సుజాత చెప్పుకొచ్చారు. అయితే తరువాత తనకు ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసిందని..అందుకే ఇప్పుడు బయటకు వచ్చి నిజం చెబుతున్నానని అన్నారు. కర్ణాటక ప్రజలు, ధర్మస్థల భక్తులు తనను క్షమించాలని కోరారు.

Also Read: Big Headache: అదో పెద్ద తలనొప్పి..నూనె, వెనిగర్ లా కలవడం లేదు..పుతిన్, జెలెన్ సమాశంపై ట్రంప్ వ్యాఖ్య

Advertisment
తాజా కథనాలు