Viral: స్నేహితుడు సినిమా రిపీట్.. వైద్యుడి వీడియో కాల్‌తో ఇంట్లోనే భార్యకు ప్రసవం చేసిన భర్త

తమిళనాడులో స్నేహితుడు సినిమా రిపీట్ అయ్యింది. కాకపోతే ఇక్కడ భర్త తన భార్యకు వైద్యుడి వీడియో కాల్ సాయంతో ప్రసవం చేస్తాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
Husband helps wife deliver baby at home in Tamilnadu

Husband helps wife deliver baby at home in Tamilnadu

Viral: మీరు స్నేహితుడు సినిమా చూశారా ?. అందులో హిరోయిన్ ఇలియానా సోదరికి పురిటినొప్పులు వస్తాయి. ఆ సమయంలో అక్కడికి వచ్చిన హిరో విజయ్ అతని స్నేహితులకు ఏం చేయాలో అర్ధం కాదు. దీంతో వీడియో కాల్‌లో ఇలియానాతో మాట్లాడుతూ.. ఆమె చెప్పినట్లు చేస్తారు. తన సోదరికి విజయవంతగా డెలివరీ చేస్తారు. అచ్చం ఇలాంటి సీనే తమిళనాడులో రిపీట్ అయ్యింది. కాకపోతే ఇక్కడ భర్త తన భార్యకు వైద్యుడి వీడియో కాల్ సాయంతో ప్రసవం చేస్తాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే   

Also Read: భారతదేశంలో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్.. ట్రంప్ కుట్ర అదేనా?

ఇక వివరాల్లోకి వెళ్తే..

తూత్తుక్కుడి జిల్లాలోని తిరుచెందూర్‌కు చెందిన గజేంద్రన్ (32) బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈమె భార్య సత్య. ప్రస్తుతం వీళ్లు దిండిగల్లు జిల్లాలోని ఎల్లైనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. గజేంద్రన్ భార్య సత్య నిండు గర్భిణిగా ఉంది. అయితే గురువారం మధ్యాహ్నం ఆమెకు అకస్మాత్తుగా పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో గజేంద్రన్ భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయాడు. వైద్యుడికి వీడియో కాల్ చేశాడు. అతడు చెప్పింది చేసి భార్యకు సక్సెస్‌ఫుల్‌గా ప్రసవం చేశాడు. 

Also Read: క్రిమినల్స్ ఉండాల్సింది జైల్లో..పదవుల్లో కాదు..ప్రధాని మోదీ

సత్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వైద్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే స్థానికులు గజేంద్రన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పినా అతడు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ప్రసవం చేశాడు. దీంతో గజేంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 

Also Read: రాహుల్‌పై సంచలన ఆరోపణలు.. ట్రాన్స్‌జెండర్‌‌పై కాంగ్రెస్ MLA అత్యాచారం!?

ఇలాంటి సంఘటన ఇదే మొదటిది కాదు. గతంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. 2021లో ఉత్తరప్రదేశ్‌లో ఓ గర్భిణీకి అర్ధరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. ఆమె భర్త అంబులెన్స్‌కు కాల్ చేశాడు. కానీ అది రావడం ఆలస్యం అయ్యింది. దీంతో భర్త ఫోన్‌లో వైద్య సిబ్బందికి కాల్ చేశాడు. అతడు ఇచ్చిన సూచనల ఆధారంగా భార్యకు ప్రసవం చేశాడు. అనంతరం అంబులెన్స్ సిబ్బంది వచ్చి తల్లి, బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు.  

2020లో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అమెరికాలోని జార్జియాలో ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. అప్పుడు భర్త తన స్నేహితుడైన ఓ డాక్టర్‌కు వీడియో కాల్ చేశాడు. వైద్యుడు ఇచ్చిన సూచనల ఆధారంగా భార్యకు డెలివరీ చేశాడు. తల్లిబిడ్డ కూడా క్షేమంగా ఉన్నారు. 2018లో లండన్‌లో ఓ మహిళకు రైలులో వెళ్తుండగా పురిటినొప్పులు వ్చచాయి. దీంతో రైలు సిబ్బంది వైద్యుడికి వీడియో చేసి అతడు చెప్పినట్లు చేశారు. విజయవంతంగా ఆమెకు ప్రసవం చేశారు. ఇంకా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. కానీ సరైన అవగాహన లేకుండా ఇలాంటివి ఇంట్లోనే చేస్తే తల్లి బిడ్డకు ప్రమాదం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పురిటినొప్పులు వచ్చినప్పుడు సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెబుతున్నారు. 

Also Read: క్రికెట్‌ కిట్‌ కోసమే దొంగతనం చేసిన విద్యార్థి.. కూకట్‌పల్లి మర్డర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు

Advertisment
తాజా కథనాలు