/rtv/media/media_files/2025/10/02/three-youth-killed-in-road-accident-in-tamilnadu-2025-10-02-15-04-01.jpg)
Three Youth Killed In Road Accident In Tamilnadu
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం(road accident) లో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. దసరా(Dasara 2025) పండుగ సందర్భంగా ఓ అయిదుగురు యువకులు చెన్నై నుంచి మన్నార్ ట్రిప్‌కు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే విల్లుపురం వద్ద వాళ్ల కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆ వాహనంలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ముగ్గురు యవకులు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Also Read: 200 ఏళ్ళ నాటి శాపం.. ఆ ప్రాంతంలో చీరలు కట్టుకొని పురుషుల నృత్యాలు!
Road Accident In Tamilnadu
மூணாறு சுற்றுலா சென்றவர்களின் கார் விபத்து - 3 பேர் பலி | Vikravandi Car Accident | News One Tamil#vikravandi#RoadAccident#NewsOneTamilpic.twitter.com/Ux41CiD7Gc
— News One Tamil (@NewsOneTamil) October 2, 2025
సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు యువకులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కారులో మంటలు చెలరేగడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ అయ్యింది.
Also Read: లైవ్ వీడియో.. రూ.6 లక్షల నెక్లెస్‌ను క్షణాల్లో కొట్టేసిన మహిళ