Aircraft: అద్భుతం.. కేవలం రూ.7 వేలతోనే విమానాన్ని తయారు చేసిన యువకుడు

బిహార్‌కు చెందిన ఓ యువకుడు చేసిన అద్భుతం అందిరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతడు కేవలం రూ.7 వేలతోనే ఓ మినీ విమానాన్ని తయారు చేశాడు. అది కూడా స్క్రాప్‌ మెటిరియల్స్‌ (చెత్త) తోనే రూపొందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

New Update
bihar boy builds mini aircraft using scrap

bihar boy builds mini aircraft using scrap

ప్రపంచంలో సాంకేతికత రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా యువత కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ముందుకొస్తోంది. కొంతమందైతే ఎలాంటి సపోర్ట్‌ లేకపోయినా కూడా చుట్టుపక్కల దొరికే వ్యర్థ పదార్థాలతోనే తాము అనుకున్నది తయారుచేస్తున్నారు. అయితే తాజాగా బిహార్‌కు చెందిన ఓ యువకుడు చేసిన అద్భుతం అందిరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతడు కేవలం రూ.7 వేలతోనే ఓ మినీ విమానాన్ని తయారు చేశాడు.   

Also Read: ఫిడే మహిళల ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

ఇక వివరాల్లోకి వెళ్తే బిహార్‌లోని అవనీష్ కుమార్‌ అనే యువకుడికి ఎలాంటి డిగ్రీ లేదు. కానీ తనకున్న సాంకేతిక నైపుణ్యాలతో అందరూ ఆశ్యర్యపోయే ఆవిష్కరణ చేశారు. కేవలం రూ.7 వేల ఖర్చుతో మినీ విమానాన్ని తయారు చేశాడు. అది కూడా స్క్రాప్‌ మెటిరియల్స్‌ (చెత్త) తోనే రూపొందించాడు. దీన్ని తయారుచేసేందుకు అతడు ఎలాంటి ల్యాబ్‌ను కూడా వినియోగించలేదు. డబ్బులు లేకపోయినా కూడా తక్కువ ఖర్చుతోనే దాన్ని తయారు చేసి విజయవంతంగా ప్రయోగించాడు.  

Also read:  లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై గందరగోళం.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఆ విమానాన్ని ప్రయోగించాడు. దాన్ని చూసేందుకు చాలామంది వచ్చారు. ఆ విమానాన్ని అవనీష్ స్వయంగా నడిపాడు. గాల్లో కాసేపు చక్కర్లు కొట్టాడు. దీంతో అక్కడున్న వాళ్లు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అవనీష్‌ను ప్రసంశలతో ముంచెత్తుతున్నారు. అతడిని ప్రోత్సహిస్తే మరిన్ని అద్బుతాలు చేయగలడని అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు