Constable's wife : వీడేం పోలీసురా...ప్రేమ పెళ్లి.. ఆపై వేధింపులు..సెల్ఫీ వీడియో తీసుకుని...

అతను పోలీసు...ఆమె నమ్మి ప్రేమ పెళ్లిచేసుకుంది. కానీ, అతనిలో ఒక నేరస్తుడు ఉన్నాడని గుర్తించలేకపోయింది. నిత్యం భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్‌ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్‌లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది.

New Update
Constable's wife commits suicide

Constable's wife commits suicide

Constable's wife : అతను పోలీసు...అతన్ని నమ్మి ప్రేమ పెళ్లిచేసుకుంది. కానీ, అతనిలో ఒక నేరస్తుడు ఉన్నాడని భార్య గుర్తించలేకపోయింది. నిత్యం భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్‌ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్‌లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ ఘటన అందరిని షాకింగ్‌కు గురి చేసింది.

Also Read : తండ్రైన ‘ఛావా’ నటుడు.. మగబిడ్డకు స్వాగతం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్,  సౌమ్య కశ్యప్ నాలుగు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అత్తింటివారింట అడుగుపెట్టిన సౌమ్యకు కొద్దిరోజుల్లోనే భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ప్రేమ పెళ్లికావడంతో తమకు కట్నం తీసుకురాలేదని రోజు బాధపెట్టేవారు. అనురాగ్ కుటుంబం కట్నం గురించి సౌమ్యను ఇబ్బందులకు గురిచేసేవారు. దీంతో కుటుంబ సభ్యుల ఒత్తిడితో, అనురాగ్ ఆమెను వేరే వివాహం చేసుకోవాలని బలవంతం చేయడం మొదలు పెట్టాడు.  ఈ విషయాలన్ని ఆమె తన సెల్ఫీ వీడియోలో వెల్లడించింది.

Also Read:singer Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు వైరల్!

అంతేకాదు, అనురాగ్ తరచుగా తనను కొట్టేవాడని ఆరోపించింది. ఈ విషయాలన్నింటిని సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో  ఏడుస్తూ ఓ  వీడియోను పోస్ట్ చేసింది. అత్తింటి వేధింపులకు తోడు భర్త కూడా వారికి సపోర్టుగా మారడంతో సౌమ్య మానసికంగా కుంగిపోయింది. తీవ్ర మనోవేధనకు గురైంది. తనను మానసికంగా వేధించారని, తన భర్త, ఆయన బావ, బావ సోదరుడు కూడా తనను వేధిస్తున్నారని వీడియోలో చెప్పుకొచ్చింది. "నా భర్త బావ సంజయ్ పోలీస్‌ డిపార్ట్‌‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. అతని సోదరులలో ఒకరైన రంజిత్ న్యాయవాది. వీరి వద్ద డబ్బు ఉంది, డబ్బుతో వారు ఏదైనా చేయగలరు. వారు నన్ను ఎంతగానో హింసించారు. ఈరోజు నేను చనిపోతున్నానంటే వీరే కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు