Pahalgam Attack: పహల్గాం బాధిత మహిళల్లో ఆ లక్షణాలు లేవు.. బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

పహల్గాం ఉగ్రదాడిలో భర్తలు కోల్పోయిన భార్యలపై బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా సంచలన కామెంట్స్ చేశారు. ఆ మహిళల్లో వీరోచిత లక్షణాలు లేవని అందుకు వారు బాధితులు అయ్యారన్నారు. ఆ మహిళలు కూడా అగ్నివీర్ శిక్షణ పొంది ఉంటే తిరిగి పోరాడి విజయం సాధించేవారని అన్నారు.

New Update
BJP MP Ram Chandra Jangra

BJP MP Ram Chandra Jangra

పహల్గాం ఉగ్రదాడిలో భర్తలు కోల్పోయిన భార్యలు దుఃఖంలో ఉండగా హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా సంచలన కామెంట్స్ చేశారు. పహల్గాం మహిళల్లో వీరోచిత లక్షణాలు, ఉత్సాహం లేవని అందుకు వారు బాధితులు అయ్యారని ఎంపీ రామ్ చందర్ జంగ్రా అన్నారు. ఆ మహిళలు కూడా అగ్నివీర్ శిక్షణ పొంది ఉంటే ఉగ్రవాదులపై తిరిగి పోరాడి ఉండేవారని, తప్పకుండా విజయం సాధించే వారని బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

ఇదిలా ఉండగా ఇటీవల కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు భాషాపరమైన లోపం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. మంత్రి ఆమెకు బహిరంగంగా క్షమాపణ తెలియజేశారు.

ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు