Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదుల పాలన..షేక్ హసీనా సంచలన కామెంట్స్!

బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం మధ్య  ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదుల సహాయంతో యూనస్ బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆరోపించారు.  

New Update
Bangladesh haseena

బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం మధ్య  ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదుల సహాయంతో యూనస్ బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నారని, వీటిలో చాలా ఉగ్రవాద సంస్థలు అంతర్జాతీయంగా నిషేధించబడినవని షేక్ హసీనా అన్నారు.యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారని ఆరోపించారు.  

ఉగ్రవాదుల పాలన

మాజీ ప్రధాని షేక్ హసీనా తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో యూనస్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి నిషేధిత వ్యక్తుల సహాయం తీసుకున్నారని, వారి నుండి మేము ఇప్పటివరకు బంగ్లాదేశ్ పౌరులను రక్షించామన్నారు.  ఒకే ఒక్క ఉగ్రవాద దాడి తర్వాత తాము కఠిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇందులో చాలా మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయని..  యూనుస్ అలాంటి వారందరినీ విడుదల చేశాడని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌ను పాలిస్తున్నారంటూ షేక్ హసీనా సంచలన ఆరోపణలు గుప్పించారు. 

సుదీర్ఘ పోరాటం,  యుద్ధం ద్వారా దేశాన్ని సాధించుకున్నదని షేక్ హసీనా గుర్తుచేసుకున్నారు. చట్టవిరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకున్న ఈ తీవ్రవాద నాయకుడికి రాజ్యాంగాన్ని తాకే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వారికి ప్రజల ఆదేశం లేదు, రాజ్యాంగ ఆధారం లేదు. యూనస్ ముఖ్య సలహాదారు పదవిని నిర్వహించడానికి ఎటువంటి ఆధారం లేదని, అది ఉనికిలో లేదని అన్నారు. పార్లమెంటు లేకుండా ఆయన చట్టాన్ని ఎలా మార్చగలరు, ఇది చట్టవిరుద్ధమని ఆమె అభిప్రాయపడ్డారు. షేక్ హసీనా అధికారాన్ని విడిచిపెట్టినప్పటి నుండి బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొంది. దేశంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక తిరుగుబాటు జరిగింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ ముఖ్య సలహాదారుగా ఉన్నారు. కానీ తొమ్మిది నెలల్లోనే, ఈ యుద్ధం ఇప్పుడు సైన్యం వర్సెస్ యూనస్ గా మారింది. డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్ సైన్యం అల్టిమేటం ఇచ్చింది. 

 bangladesh | india | sheikh-hasina | yunus 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు