Supreme Court: యూట్యూబర్లకు బిగ్ షాక్.. అలా చేస్తే కుదరదు

స్టాండప్ కమెడియన్ సమే రైనా, అలాగే ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వికలాంగుల గురించి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వారి యూట్యూబ్ చానల్స్‌, సోషల్ మీడియాలో దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశించింది.

New Update
Supreme court

Supreme court

యూట్యూబర్(youtubers), స్టాండప్ కమెడియన్ సమే రైనా, అలాగే ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు(youtube influencers) వికలాంగుల గురించి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సోమవారం జరిగిన విచారణలో యూట్యూబ్ వారి చానల్స్‌,  ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వికలాంగులకు క్షమాపణ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. "హ్యూమర్ అనేది జీవితంలో ఒక భాగం, మనం మన మీద కూడా జోకులు వేసుకోవచ్చు. కానీ ఇతరుల గురించి, వారి భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా జోకులు చేయడం సరికాదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. సమాజంలో ఎంతో వైవిధ్యం ఉన్నప్పుడు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి హాని జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే, ఈ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిధిలోకి రావు అని, ఇది వాణిజ్య ప్రసంగం కిందకు వస్తుందని, దీనికి పరిమితులు ఉంటాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

Also Read :  అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్‌

Supreme Court Orders YouTuber

'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA)' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న వారిని ఉద్దేశించి, సమే రైనా(Raina) చేసిన వ్యాఖ్యలపై 'క్యూర్‌ SMA ఇండియా ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వికలాంగులను ఎగతాళి చేస్తూ చేసిన జోకులు వారి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇది వాక్ స్వాతంత్ర్య పరిధిలోనికి రాదని, ద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తుందని కోర్టుకు తెలిపారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు సూర్య కాంత్, జ్యోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం, క్షమాపణ చెప్పడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.

Also Read :  ఈడీ దాడులు.. పారిపోయేందుకు గోడ దూకిన ఎమ్మెల్యే అరెస్ట్!

ఈ మార్గదర్శకాలు కేవలం ఒక సంఘటనకు స్పందనగా కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని విస్తృత ప్రాతిపదికన ఉండాలని కోర్టు సూచించింది. ఈ ఆదేశం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల కంటెంట్ క్రియేటర్లకు ఒక హెచ్చరికగా మారింది. తమ కంటెంట్ పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇతరుల భావాలను, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదని ఇది స్పష్టం చేస్తోంది. తదుపరి విచారణ నవంబర్ నెలలో జరగనుంది.

Advertisment
తాజా కథనాలు