/rtv/media/media_files/2025/08/25/tmc-mla-2025-08-25-14-56-58.jpg)
బెంగాల్ టీచర్(Bengal Teacher) నియామక కుంభకోణం వ్యవహారంలో టీఎంసీ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా ఇంటిపై ఈడీ(ed-raids) అధికారులు దాడి చేశారు. ఈ క్రమంలో మొదటి అంతస్తు నుంచి గోడ దూకి పారిపోయేందుకు ఎమ్మెల్యే యత్నించారు. దీంతో అధికారులు ఆయన్ను పట్టుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్(West Bengal) లోని ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా ఇంటిపై 2025 ఆగస్టు 25వ తేదీ సోమవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరిగాయి. అయితే ఈడీ అధికారులు ఇంట్లోకి ప్రవేశించగానే, ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా గోడ దూకి పారిపోవడానికి యత్నించారు. అయితే వెంటనే అలెర్ట్ అయిన భద్రతా బలగాలు అతడిని అడ్డుకున్నాయి. సాహా తన ఫోన్లను కూడా పొదల్లోకి విసిరివేశారు.
Also Read : Hyderabad: లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!
Breaking | TMC MLA Jiban Krishna Saha has been arrested by the Enforcement Directorate (ED) in connection with the SSC scam. When ED officials arrived at his Burwan residence in Murshidabad, Saha attempted to flee by jumping over the boundary wall but was apprehended. He also… pic.twitter.com/6TfMQHfO7C
— Piyali Mitra (@Plchakraborty) August 25, 2025
ఎమ్మెల్యే అరెస్ట్
అయితే అతని రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ కు పంపించామని ఈడీ అధికారులు చెబుతున్నారు. విచారణకు సహకరించనందుకు అతడిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈడీ బృందాలు టీఎంసీ నేత జిబాన్ కృష్ణ సాహా బుర్వాన్ నివాసంతో పాటు రఘునాథ్‌గంజ్‌లోని అతని అత్తమామలకు చెందిన ఆస్తులను సోదా చేస్తున్నాయి. కాగా ఈ కుంభకోణానికి సంబంధించి సాహా భార్యను గతంలో ఏజెన్సీ ప్రశ్నించింది. ఇదే విషయంపై ఎమ్మెల్యేను 2023 ఏప్రిల్‌లో సీబీఐ అరెస్టు చేసి, 2025 మేలో బెయిల్ మంజూరు చేసింది. స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లోని క్రిమినల్ కోణాలను సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, ED దాని మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తోంది.
Also Read : Hyderabad: లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!
రాజకీయాల్లోకి రాకముందు
రాజకీయాల్లోకి రాకముందు ఆయన ప్రభుత్వ పాఠశాలలో సహాయ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన భార్య కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆయన 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2023 ఏప్రిల్‌లో పాఠశాలల్లో టీచర్ల నియామకాల కుంభకోణానికి సంబంధించి సీబీఐ సాహాను అరెస్ట్ చేసింది. 13 నెలల పాటు జైలులో ఉన్న తర్వాత, 2024 మే 14న ఆయనకు బెయిల్ మంజూరైంది.