/rtv/media/media_files/2025/08/11/big-supreme-court-order-on-stray-dog-menace-2025-08-11-14-09-27.jpg)
Big Supreme Court Order On Stray Dog Menace
ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ప్రాంతాల్లో వీధి కుక్కల సమస్య పెరగడం ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్యను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి తాజాగా సంచలన తీర్పునిచ్చింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉన్న వీధి కుక్కలన్నింటినీ గుర్తించి షెల్డర్లకు తరలించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును 8 వారాల్లోగా అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
రేబిస్ వ్యాధితో మృతి చెందిన వాళ్లను ఎవరు బయటకు తీసుకొస్తారని సుప్రీంకోర్టు ధ్వజమెత్తింది. వీధి కుక్కల బెడద అనేది ఒక ఇబ్బందికరమైన విషయం మాత్రమే కాదని.. ఇది ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని అసహనం వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన ప్రజా భద్రతా సమస్య అని పేర్కొంది. అంతేకాదు వీధి కుక్కుల, వాటిని పెంచుకునే ప్రజల హక్కుల మధ్య బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది. కానీ మనుషుల ప్రాణాల కంటే జంతువుల క్షేమం ముఖ్యం కాదని తెలిపింది.
Also Read: నేడే లోక్ సభలో కొత్త పన్ను బిల్లు..ప్రైవేట్ ఉద్యోగులకు భారీ ఉపశమనం
ఇదిలాఉండగా ఢిల్లీ-NCRలో వీధి కుక్కల బెడత తీవ్రంగా ఉంది. ఉదయం, రాత్రి పూట వాకింగ్‌కు వెళ్లేవారిపై, పిల్లలపై వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో రేబిస్ వ్యాధి భయం నెలకొంది. పలువురు కుక్కల దాడిలో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు వీధి కుక్కల సమస్యపై విచారణ జరిపింది. వాటన్నింటినీ షెల్టర్‌కు తరలించాలని ఆదేశించింది. ఇందుకోసం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.
Also read: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మైనంపల్లి ఎంట్రీతో కీలక నేత రాజీనామా!
మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం సులభమేమి కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ-NCR ప్రాంతంలో లక్షల సంఖ్యలో వీధి కుక్కలు ఉన్నాయని.. వాటిని గుర్తించి, షెల్టర్లకు తరలించడం అనేది పెద్ద సవాలని అంటున్నారు. అంతేకాదు వాటికి ఆశ్రయం కల్పించేందుకు సరిపడా షెల్టర్లు, సిబ్బంది కూడా కావాలని సూచిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల జంతు సంక్షేమ సంస్థల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్యయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీధి కుక్కల బెడద నెలకొన్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం వాక్సినేషన్, స్టెరిలైజేషన్ వంటి కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
Also read: ట్రంప్‌పై నటి సంచలన ఆరోపణలు.. ‘విడాకులు తీసుకున్న రోజే డేట్‌కు పిలిచాడు’