/rtv/media/media_files/2025/02/01/0Kh4mHQoefrDibmRG50p.jpg)
Nirmala Sitharaman
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది మొదట్లో ఫిబ్రవరి 13న ప్రవేశ పెట్టిన ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. దీనిని తర్వాత 31 మంది సభ్యుల సెలెక్షన్ కమిటీకి రివ్యూకు పంపించారు. ఆ కమిటీ 285 సూచనలతో 4500 పేజీల నివేదిక కేంద్రానికి జూలైలో సమర్పించింది. దానిని పరిశీలించిన కేంద్రం..సవరించిన ఆదాయపు పన్ను బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టనుంది.
ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త..
కొత్త బిల్లులో ప్రైవేటు ఉద్యోగులకు భారీ ఉపశమనం కలగనుంది. పెన్షన్ విత్ డ్రా పై పన్ను నియమాలను అందరికీ సమానంగా చేయాలని లోక్ సభ ప్రత్యేక కమిటీ సిఫార్స్ చేసింది. ఇది ఇప్పుడు లోక్ సభలో ఆమోదం పొందితే..ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పినట్టు అవుతుంది. ఇంతకు ముందు ఈ బెనిఫిట్ ను కొంతమంది ప్రైవేటు ఉద్యోగులకు మాత్రమే ఉండేది. సొంతంగా పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు మినహాయింపు ఉండేది కాదు. ఇప్పుడు ఈ వ్యత్యాసాన్ని తొలగించాలని ప్రత్యేక కమిటీ సిఫార్స్ చేసింది.
32 ప్రధాన మార్పులతో కొత్త బిల్లు..
ఇక కొత్త బిల్లు 32 ప్రధాన మార్పులు ఉన్నాయని తెలుస్తోంది. కొత్త బిల్లును మరింత సరళీకృతం చేసారు. ఇంతకు ముందు 5.12 లక్షలు ఉంటే ఇప్పుడు వాటిని 2.6 లక్ష పదాలకు తగ్గించారు. లాగే అందులో ఉండే విభాగాల సంఖ్య కూడా 819 నుంచి 536కు తగ్గించారు. అలాగే అధ్యాయాలను 47 నుంచి 23కు తగ్గించబడ్డాయి. మరోవైపు పన్ను విధాన్ని కూడా సరళీకృతం చేయాలని డిసైడ్ చేశారు. ఆదాయపు నియమాలను మరింత స్పష్టంగా ఉంచాలని కమిటీ సూచించింది. అలాగే ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యం చేస్తే రిఫండ్ ఇవ్వకూడదన్న ఆదాయపు పన్ను నియమాన్ని తొలగించాలని కమిటీ తెలిపింది.
సెక్షన్ 115BAA కింద ప్రత్యేక పన్ను రేటు పొందే కంపెనీలకు ఇంటర్-కార్పొరేట్ డివిడెండ్లపై తగ్గింపుకు సంబంధించిన సెక్షన్ 80Mలో కూడా మార్పులను కమిటీ సూచించింది. ఇక పన్ను చెల్లింపుదారులు జీరో టీడీఎస్ సర్టిఫికేట్ పొందేందుకు అనుమతించడం గురించి కూడా ప్రత్యేక కమిటీ కీలక సూచనలు చేసింది. సూక్ష్మ, చిన్న పరిశ్రమల నిర్వచనాన్ని MSME చట్టం ప్రకారం చేయాలని సిఫార్స్ చేసింది. ఈ కొత్త బిల్లులో ఇప్పటివరకు స్వీకరించబడిన 'అసెస్‌మెంట్ ఇయర్', అంతకు ముందు ఏడాది రెండిటినీ ఏకీకృత టాక్స్ ఇయర్ గా అంటే ఒకే దానిలో భర్తీ చేయాలని ప్రత్యేక కమిటీ ప్రతిపాదించింది.