Trump: ట్రంప్‌పై నటి సంచలన ఆరోపణలు.. ‘విడాకులు తీసుకున్న రోజే డేట్‌కు పిలిచాడు’

ప్రముఖ హాలీవుడ్ నటి ఎమ్మా థాంప్సన్ ఇటీవల లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆమె విడాకులు తీసుకున్న రోజునే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి డేట్‌కు రమ్మని పిలిచారట. ఈ ఘటన 1998లో జరిగిందని ఆమె తెలిపారు.

New Update
actress Emma Thompson

ప్రముఖ హాలీవుడ్ నటి ఎమ్మా థాంప్సన్ ఇటీవల లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆమె విడాకులు తీసుకున్న రోజునే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి డేట్‌కు రమ్మని పిలిచారట. ఈ ఘటన 1998లో తాను 'ప్రైమరీ కలర్స్' అనే సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు జరిగిందని ఆమె తెలిపారు. ఆ ఫోన్ కాల్ సంభాషణ గురించి ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్పారు. ఫోన్ చేసి నేను డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నానని చెప్పినట్లు థాంప్సన్ గుర్తు చేసుకున్నారు. మొదట అది ఆమె జోక్ అనుకున్నారట. తర్వాత మీకు నేను ఎలా సహాయం చేయగలనని అడిగారు. దానికి ట్రంప్ "మీరు నాతో డేడ్‌కు రావాలని కోరుకుంటున్నాను. మనం కలిసి డిన్నర్ చేయవచ్చు" అని ట్రంప్ అన్నారని ఆమె వివరించారు.

అయితే, థాంప్సన్ ఆ కాల్‌కు సున్నితంగా స్పందిస్తూ, "చాలా బాగుంది, ధన్యవాదాలు. నేను మీకు తిరిగి కాల్ చేస్తాను" అని చెప్పి పెట్టేసినట్లు తెలిపారు. ఈ సంఘటన జరిగిన రోజునే తన విడాకులు  అధికారికంగా ఖరారు అయ్యాయని చెప్పారు. ఆ సమయంలో ట్రంప్ కూడా అతని రెండవ భార్య మార్లా మాపుల్స్ నుంచి విడిపోయారని, బహుశా తనకు తగిన భాగస్వామి కోసం వెతుకుతున్నారని థాంప్సన్ వ్యాఖ్యానించారు. ట్రంప్ తన నంబర్‌ను తెలుసుకోవడం ఒకరకంగా అది ఆమెను ఫాలో చేయడమే అని అన్నారు.

ఒకవేళ తాను ఆ డేట్‌కు వెళ్లి ఉంటే, "అమెరికా చరిత్రను మార్చి ఉండేదాన్ని" అంటూ ఎమ్మా థాంప్సన్ నవ్వుతూ అన్నారు. గతంలో కూడా ప్రముఖ నటి సల్మా హయక్ కూడా ట్రంప్ తనను డేట్‌కు రమ్మని అడిగారని వెల్లడించారు. ఈ రకమైన సంఘటనలు హాలీవుడ్‌లో కొత్తేమీ కానప్పటికీ, ఎమ్మా థాంప్సన్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ఎమ్మా థాంప్సన్ ప్రస్తుతం నటుడు గ్రెగ్ వైస్‌ను వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు