Samsung Galaxy F06 5G: శామ్‌సంగ్ నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. ధర రూ.9 వేలే.. ఓ లుక్కేయండి!

శామ్‌సంగ్ కంపెనీ గ్యాలక్సీ F06 5G కొత్త స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 12న లాంఛ్ చేయనుంది. కేవలం రూ.9 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో మంచి మొబైల్‌ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.

New Update
Samsung Galaxy F06 5G

Samsung Galaxy F06 5G Photograph: (Samsung Galaxy F06 5G)

దేశంలో శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫో‌ను విడుదల చేయనుంది. శామ్‌సంగ్ గ్యాలక్సీ F06 5G (Samsung Galaxy F06 5G) ఫోన్‌ను ఫిబ్రవరి 12 లాంఛ్ చేయనుంది. బెస్ట్ ఫీచర్స్‌తో అతి తక్కువ ధరకే మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఈ మొబైల్ ధర రూ.10 వేలు కంటే తక్కువే. కేవలం రూ.9 వేలకే ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌లో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!

ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!

బ్యాక్ ప్యానెల్ క్యాపూల్స్‌తో..

పాత శామ్‌సంగ్ గ్యాలక్సీ F05 5G డిజైన్‌తో పోలిస్తే దీన్ని కొత్తగా డిజైన్ చేశారు. ఇది గెలాక్సీ ఎ-సిరీస్, ఎస్-సిరీస్‌లకు దగ్గరగా పోలి ఉంటుంది. దీనికి లేత నీలం రంగు బ్యాక్ ప్యానెల్‌తో క్యాప్సూల్ ఆకారంలో డిజైన్ చేశారు. ఫ్రంట్ కెమెరా నాచు డిజైన్ ఉంటుంది. శామ్‌సంగ్ గ్యాలక్సీ F06 5G బ్యాక్ కెమెరా 50MP ప్రైమరీ ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!

అలాగే ఇందులో సెకండరీ కెమెరా 2MPతో పాటు సెల్ఫీ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. దీనికి హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉండటంతో పాటు హెచ్‌డీ+ రిజల్యూషన్ కూడా ఉంది. 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. దీనికి 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫీచర్ ఇవ్వడంతో పాటు పవర్ బటన్‌పై సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ కూడా ఇచ్చారు. ఈ మొబైల్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తుంది. 

ఇది కూడా చూడండి: Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు