/rtv/media/media_files/2025/02/11/ab6bnAmY5A9QnVDrgodV.jpg)
Tirumala laddu Bhumana Karunakar Sensational allegations on cm Chandrababu
Tirupati laddu: తిరుమల పవిత్రత దెబ్బతినేలా ఏపీ సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశాడని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు, పందికొవ్వు కలసినట్లు ఒక్క మాట CBI సిట్ రిమాండ్‌లో చెప్పలేదన్నారు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం లడ్డూలో పందికోవ్వు, జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని మండిపడ్డారు. ఏఆర్ డైరీ సహా ఇతర రెండు డైరీలు చేసినా అక్రమాలపై మాత్రమే రిమాండ్ రిపొర్టులో బయటపడిందన్నారు. నాణ్యత లేకుండా వనస్పతి కలవడంతో తిరస్కరించామని ఈవో శ్యామలరావు చెప్పినట్లు గుర్తు చేశారు.
పవన్ పచ్చి అబద్ధాలు..
ఏఆర్ డైరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకుల్లో నాణ్యత లేదని వెనక్కి పంపినట్లు ఈవో తెలిపారు. అరెస్టు అయినా నలుగురు సరఫరా వ్యవహారంలో తప్పులు చేశారని సిట్ చెబుతోంది. ల్యాబులో దృవీకరించిన తరువాత తిరుమలకు నెయ్యి పంపుతారు. కల్తీ జరగకుండానే జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారు. లడ్డు నాణ్యత పెంచడానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రత్యేక చర్యలు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. సిట్ రిపోర్టులో ఎక్కడ కూడా కల్తీ జరిగిందని చెప్పలేదు. పవన్ కల్యాణ్ అయితే పవననందా స్వామీ అంటూ తిరుపతిలో సభ పెట్టి అబద్దాలు చెప్పాడని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: లక్కీ లేడీ.. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు హగ్ ఇచ్చిన కోహ్లీ: వీడియో వైరల్!
ఇక అయోధ్యకు లక్ష లడ్డులు సరఫరా చేశారని పవన్ చెప్పాడం దారుణం. బురద చల్లుతాం తుడుచుకోవాలనేలా కూటమీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అసత్య ప్రచారం చేస్తున్న కూటమీ ప్రభుత్వం దేవదేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు. రాజకీయాలు పరమైన ఆరోపణలు ఏమైనా చేసుకోండి కానీ వెంకటేశ్వర స్వామీని స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దన్నారు. నెయ్యిలో కల్తీ జరగలేదని, కల్తీ జరిగింది అంతా పవన్, చంద్రబాబు బుద్దిలోనే అన్నారు.