/rtv/media/media_files/2025/08/12/dogs-in-delhi-2025-08-12-20-51-56.jpg)
Delhi-NCR stray dogs
దేశ సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలపైనే వ్యతిరేక వ్యక్తమవుతోంది. సీని తారులు సైతం కోర్టు ఆర్డర్స్‌ను తప్పుబడుతున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతోంది. అసలు కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి..? ఢిల్లీలో కుక్కల ఆరుపులు దేశం మొత్తం వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటో ఇప్పుడు డిటేల్‌గా చూద్ధాం..
ఢిల్లీలో కుక్కల పంచాయతీ
దేశ రాజధాని ఢిల్లీ(Delhi) తోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ఉన్న వీధి కుక్కులను తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాటిని శుభ్రం(స్టెరిలైజ్) చేసి ప్రత్యేక షెల్టర్‌లలో వాటిని ఉంచాలని.. ఆయా ప్రాంతాల్లోని పరిపాలన యంత్రాంగాలను సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు అమానవీయంగా ఉన్నాయని జంతు ప్రేమికులు విమర్శిస్తుండగా.. ఇతరులు మాత్రం ఆ ఆదేశాలకు మద్దత్తు పలుకుతున్నారు. వీధి కుక్కల దాడి ఘటనలు, జరిగిన ప్రాణ నష్టం గురించి కొందరు గుర్తుచేస్తున్నారు. ఈ తీవ్ర చర్చలో నుంచి ఓ కీలక ప్రశ్న పుట్టుకొచ్చింది. ఢిల్లీలో పరిసరప్రాంతాల్లో వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి? అన్నింటినీ ప్రత్యేక షెల్టర్‌లకు తరలించాలి సరే.. మరె ఆ షెల్టర్‌లు ఎక్కడ ఉన్నాయి..? షెల్టర్‌లు లేకుండా సుప్రీంకోర్టు ఆదేశాల అమలు సాధ్యమా..? అన్నది ప్రశ్న.
🚨 All stray dogs in Delhi NCR to be moved to shelters, want the city to be free of stray dogs - Supreme Court.
— Indian Tech & Infra (@IndianTechGuide) August 11, 2025
SC says no room for sentiments to animal rights activists. pic.twitter.com/SC6d9Wylrt
Also Read : కర్ణాటకలో 6,395 ఏనుగులు.. భారీగా పెరిగిన ఎనుగుల జనాభా
రాజధాని వీధుల్లో 10 లక్షల కుక్కలు
ఢిల్లీ NCR ప్రాంతంలో సంఖ్యల్లో కుక్కలు ఉన్నాయి. కానీ వాటికి సరిపడా షెల్టర్‌లు లేవు. సరిపడా షెల్టర్ నిర్మించాలంటే ముందుగా కోట్లల్లో ఫండ్స్ కావాలి. వాటిని నిర్మించడానికి తగినంత సమయం కావాలి. అదేవిధంగా సరిపడా మ్యాన్ పవర్ లేకపోవడం, కుక్కలను తీసుకెళ్లకుండా స్థానికుల నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. ఈవన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అవరోధంగా ఉన్నాయి. 2009 కుక్కల జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ, NCR ప్రాంతంలో 5.6 లక్షల కుక్కలు ఉన్నాయి. అప్పటి నుంచి కుక్కల జనాభాను లెక్కించలేదు. అయితే 16 ఏళ్ల కాలంలో కుక్కల సంఖ్య రెట్టింపు అయ్యిండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కుక్కల సంఖ్య 10 లక్షలకుపైనే ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ప్రతి 500 కుక్కలకు ఒక షెల్టర్ నిర్మించాలన్నా మొత్తం 2 వేల షెల్టర్‌ల అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కేవలం 20 షెల్టర్‌లు మాత్రమే ఉన్నాయి.
ఈ షెల్టర్‌లు కుక్కలను పట్టుకొచ్చి వాటిపై ఉన్న సూక్ష్మక్రిమూలు తొలగించి విడిచిపెట్టడానికి మాత్రమే సరిపోతాయి. కానీ కుక్కలకు శాశ్వత ఆశ్రయం కల్పించడం సాధ్యం కాదు. ఒకవేళ ఇప్పుడున్న షెల్టర్‌లనే శాశ్వత షెల్టర్‌లుగా మార్చినా 5 వేల కుక్కలనే వాటిలో ఉంచగలం. కుక్కలకు షెల్టర్‌లు నిర్మించడమనేది సవాలక్ష సమస్యల్లో ఒక్కటి మాత్రమే. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్
కుక్కులను పట్టడం, వాటికి ఆహారం అందించడం కూడా ప్రధాన సమస్యలే. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ దగ్గర కుక్కలను పట్టేందుకు ప్రస్తుతం ఒక్కో జోన్‌కు కేవలం 2 నుంచి 3 వ్యాన్‌లు మాత్రమే ఉన్నాయి. కుక్కలను పట్టేవాళ్లలో సుశిక్షితులు లేరు. కాబట్టి నివాస ప్రాంతాల్లో కుక్కలను రౌండప్ చేసి పట్టి తీసుకురావడం అనేది చెప్పినంత సులభం కాదు. అంతేగాక పలు ప్రాంతాల్లో జంతు ప్రేమికులు కూడా అడ్డు తగిలే అవకాశం ఉంది.
ఖర్చుతో కూడిన పని
అదేవిధంగా లక్షల కుక్కలను షెల్టర్‌లకు తరలించగలిగినా అన్ని కుక్కలకు రోజూ ఆహారం అందించడం అనేది అంత సులువైన పనేమీ కాదు. అందుకు ప్రతి ఏడాదికి వందల కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి. అంతేగాక ఆ కుక్కల సంరక్షణ కోసం యానిమల్ అంబులెన్స్‌లు, వెటర్నరీ డాక్టర్‌లు, ఇతర వైద్య సిబ్బంది అవసరం అవుతారు. పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాల అవసరం ఏర్పడుతుంది. అందుకు కూడా కోట్లల్లో నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల అమలు అంత సులువేమీ కాదనే మాట ఎక్కువగా వినపడుతోంది.
Also Read : బిహార్‌లో వింత ఘటన.. పిల్లికి రెసిడెన్స్ సర్టిఫికేట్కావాలంటూ దరఖాస్తు
ప్రముఖుల రిక్వెస్ట్..
వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్పు అమానుషమని, అసాధ్యమని, ఆ జంతువులకు మరణశిక్షతో సమానమని కొందరు అంటున్నారు. జంతు ప్రేమికుడిగా పేరుగాంచిన నటుడు జాన్ అబ్రహం, CJI జస్టిస్ బి.ఆర్. గవాయికి ఒక అప్పీల్ పంపారు. ఈ తీర్పును సమీక్షించాలని కోరారు. తన లేఖలో, జాన్ అబ్రహం వీధి కుక్కలను "కమ్యూనిటీ డాగ్స్" అని, "ఢిల్లీ పౌరులే" అని అభివర్ణించారు. తరతరాలుగా అవి మనుషులతో కలిసి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ తీర్పు జంతు జనన నియంత్రణ నియమాలు, 2023కి విరుద్ధంగా ఉందని, అవి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేసి తిరిగి వాటి ప్రాంతంలోనే వదిలివేయాలని సూచిస్తున్నాయని ఆయన సూచించారు. 10 లక్షల కుక్కలను తరలించడం అసాధ్యమని జాన్ అబ్రహం హెచ్చరించారు.
జాన్వీ కపూర్
నటి జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, రవీనా టాండన్, సిద్ధార్థ్ ఆనంద్ వంటి ప్రముఖులు సుప్రీంకోర్టు ఆదేశాన్ని సోషల్ మీడియాలో ఖండించారు. జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "ఒక చల్లని, నిర్లక్ష్య నగరంలో వీధి కుక్కలు వెచ్చదనాన్ని ఇస్తాయి. దుకాణదారులకు రాత్రిపూట కావలి కాస్తాయి" అని పేర్కొంది. ఒక జీవ సమూహాన్ని పూర్తిగా తొలగించడం పరిష్కారం కాదని, బదులుగా భారీ స్థాయిలో స్టెరిలైజేషన్, టీకాలు, దత్తత కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు.
దత్తత తీసుకోవాలన్న వీర్ దాస్
హాస్యనటుడు వీర్ దాస్, ప్రజలు వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని ఢిల్లీ వాసులకు పిలుపునిచ్చారు. స్థానిక జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇవ్వాలని కోరారు. స్థానిక అధికారులు స్టెరిలైజేషన్ డ్రైవ్‌లను సరిగ్గా అమలు చేయకపోవడమే ఈ సమస్యకు అసలు కారణమని ఆయన విమర్శించారు.
వీధి కుక్కల దాడులు, రేబిస్ కేసులు పెరగడంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి, తిరిగి వీధుల్లోకి వదలకూడదని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలు ప్రజల భద్రత, జంతు సంక్షేమం మధ్య ఉన్న వివాదాన్ని మరింత పెంచాయి.
order | relocate street dogs | latest-telugu-news | telugu-news | national news in Telugu | telugu viral news