ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో భూకంపం..భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన జనం..!!
ఢిల్లీ-ఎన్సీఆర్లో భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 9.34 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూకుష్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 15 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.