Rajasthan:  20కు చేరుకున్న జైసల్మేర్ బస్సు ఘోరం మృతుల సంఖ్య..మరో 16 మంది పరిస్థితి విషమం

రాజస్తాన్ లోని జైసల్మేర్ లోని బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 20మంది చనిపోయారు.మరో 16 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 57 మంది ఉన్నారని చెబుతున్నారు.

New Update
bus

రాజస్థాన్‌(rajasthan) లోని జైసల్మేర్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం(fire accident) జరిగింది. జైసల్మేర్ నుండి జోధ్‌పూర్ వెళ్తున్న AC స్లీపర్ ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో(bus-fire-accident) చిక్కుకుంది. ఈ సంఘటన వార్ మ్యూజియం సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇందులో 3 మంది పిల్లలు, 3 మంది మహిళలు సహా 12 మంది సజీవదహానం అయ్యారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 57 మంది ఉన్నారని చెబుతున్నారు. 32 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మంటల్లో బస్సు పూర్తిగా కాలిబూడిదైపోయింది.  

వేగంగా అందుకున్న మంటలు..

మంటలు అంటుకున్న వెంటనే వేగంగా వ్యాపించడంతో అదుపు చేయడం కష్టమైంది. ఇందులో నుంచి ప్రయాణికులు తప్పించడం కష్టమైంది. అకస్మాత్తుగా పొగ రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులు అయ్యారు. కొందకు కిటికీలు పగుల గొట్టి బయటకు దూకినప్పటికీ లాభం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు బస్సులో మంటలను అర్పివేశాయి. జైసల్మేర్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేటు బస్సు జోధ్‌పుర్‌ బయలుదేరింది. ఫోర్సెనిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. దీనిపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్‌ శర్మ స్పందించారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు