Ram Charan : ప్రధాని మోడీని కలిసిన రామ్ చరణ్‌ దంపతులు.. ఎందుకంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, ఉపాసన దంపతులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.రామ్ చరణ్‌ స్వయంగా సోషల్ మీడియా ద్వారా మోదీని కలిసిన ఫోటోలను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేయగా ఇప్పుడవి వైరల్ గా మారాయి.

New Update
ram charan modi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌(ram-charan-tej), ఉపాసన(upasana-konidela) దంపతులు ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ని కలిశారు.రామ్ చరణ్‌ స్వయంగా సోషల్ మీడియా ద్వారా మోదీని కలిసిన ఫోటోలను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేయగా ఇప్పుడవి వైరల్ గా మారాయి.  అనిల్ కామినేని నాయకత్వంతో జరిగిన ప్రపంచంలోని మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విశేషాలను తెలిపేందుకు ప్రధాని మోదీకి రామ్ చరణ్ వివరించారు.‘ప్రధాని మోదీ గారిని కలిసినందుకు గౌరవంగా ఉంది. ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల మీద ఉన్న అభిమానం నేడు ఆర్చరీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సాయపడుతుంది’ అంటూ తన పోస్టులో వెల్లడించారు రామ్ చరణ్‌. ఈ లీగ్ లో పాల్గొన్న వారికి స్పెషల్ విషెస్ తెలిపాడు చరణ్.   రామ్ చరణ్ ఈ క్రీడా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

Also Read :  రాజీవ్ కనకాల పై ఎన్టీఆర్ సీరియస్.. బామ్మర్ది పెళ్ళిలో అలా చేశాడని!

పెద్ది సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ఏపీలో ఈ షూటింగ్ జరుగుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతుంది.  గ్రామీణ నేపథ్య స్పోర్ట్స్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ (మిర్జాపూర్ ఫేమ్) కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమాను 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  ఇక సుకుమార్ తో చేసే సినిమా ఫస్ట్ షెడ్యూల్ వచ్చే ఫిబ్రవరిలో మొదలవుతుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read :  వీడు మగడ్రా బుజ్జి.. ఇద్దరు భార్యలతో కలిసి కర్వా చౌత్ పండగ

Advertisment
తాజా కథనాలు