/rtv/media/media_files/2026/03/02/crude-oil-2026-03-02-14-53-30.jpg)
ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న దాడులు గల్ఫ్ దేశాలకు పాకాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మరణం తర్వాత ఉద్రిక్తతలు పెరగడంతో దుబాయ్, దోహా వంటి నగరాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి 'హార్ముజ్ జలసంధి'ని ఇరాన్ మూసివేయడం ఆసియా దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు పెద్ద సవాలుగా మారింది.
Also Read : మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
హార్ముజ్ జలసంధి
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వాడే చమురులో 20 శాతం ఈ జలసంధి నుంచే వెళ్తుంది. భారత్ ముడి చమురు(crude-oil-prices) అవసరాల్లో 90 శాతాన్ని మధ్యప్రాచ్యం నుంచే పొందుతోంది. అందులో 40 శాతం ఈ మార్గం నుంచే వస్తుంది. ఇప్పుడు ఇది మూతపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది.
భారత్ నిల్వలు
కేంద్ర పెట్రోలియం శాఖ సమాచారం ప్రకారం, అత్యవసర పరిస్థితులు వస్తే భారత్ దగ్గర ప్రస్తుతం 74 రోజులకు సరిపడా నిల్వలు(Strategic oil reserves) ఉన్నాయి.
SPR (వ్యూహాత్మక నిల్వలు): ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం), కర్ణాటకలోని భూగర్భ గుహల్లో 9.5 రోజులకు సరిపడా చమురు నిల్వ ఉంది.
కంపెనీల నిల్వలు: చమురు మార్కెటింగ్ కంపెనీల వద్ద మరో 67 రోజులకు సరిపడా పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి.
Also Read : భీకర యుద్ధం.. టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రిపై దాడులు.. షాకింగ్ వీడియో
ఆర్థిక ప్రభావం
చమురు ధరలు(Crude Oil Prices Spike) పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతుంది. ఒక బారెల్ ముడి చమురు ధర ఒక్క డాలర్ పెరిగితే, భారత్ ఏటా సుమారు 12 వేల కోట్ల రూపాయలకు పైగా అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్యాస్ విషయంలోనూ మనం 50 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం కాబట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారత్ కేవలం గల్ఫ్ దేశాల మీదనే ఆధారపడటం లేదు. రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్(fuel-savings) వస్తోంది, అలాగే వెనిజులా నుంచి కూడా దిగుమతులు మొదలయ్యాయి. కాబట్టి యుద్ధం త్వరగా ముగిస్తే భారత్‌కు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ జలసంధి ఎక్కువ కాలం మూతపడితే మాత్రం ధరల పెరుగుదల తప్పకపోవచ్చు.
Follow Us