/rtv/media/media_files/2026/03/02/israel-2026-03-02-09-35-55.jpg)
Israel Bombs Tehran's Gandhi Hospital
మిడిల్‌ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గాంధీ ఆస్పత్రి ధ్వంసమయ్యింది. దీంతో వైద్యులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. పేషెంట్లను కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరక్టర్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ఆస్పత్రులపై దాడులు చేయడం ఆందోళనకరమని తెలిపారు.
Also Read: దాడులు ఆపండి'.. నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్..
ఆస్పత్రులు, ఆరోగ్య వసతులపై దాడులను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దాడిపై ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి స్పందించారు. గాంధీ ఆస్పత్రిని ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు. మరో మూడు ఇతర ఆస్పత్రులపై కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు. అయితే టెహ్రాన్‌లో ఉన్న గాంధీ ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం ఇది మొదటిసారి కాదు.
New images of the condition of Gandhi HOSPITAL in Tehran after the American-Zionist attack. pic.twitter.com/RwDNfXvliO
— Iran Military Daily (@Iranmilitary24) March 2, 2026
Also Read: పశ్చిమ బెంగాల్‌లో 50 లక్షలకు పైగా చొరబాటుదారులు.. వెలుగులోకి సంచలన నిజాలు
గతేడాది ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో కూడా ఈ ఆస్పత్రిపైనే దాడులు జరిగాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు, సైనిక స్థావరాలనే టార్గెట్ చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొంది. టెహ్రాన్‌లోని ప్రభుత్వ భవనాలపై ఒకేసారి 100 యుద్ధ విమానాలు దాడి చేసినట్లు వెల్లడించింది.
🇮🇷💥 American strike hit Gandhi Hospital in Tehran.
— New Direction AFRICA (@Its_ereko) March 1, 2026
Not a base. A hospital.
Patients. Doctors. Children. All in the blast.
If a hospital can burn, nothing is sacred. pic.twitter.com/VdHinnMRwz
Follow Us