/rtv/media/media_files/2026/03/02/sensex-2026-03-02-10-14-24.jpg)
Sensex Falls 1,100 Points, Nifty 330 As Markets Open After Iran Strikes
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్(iran israel us war) విరుచుకుపడుతున్నాయి. ఈ యుద్ధ పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్లను(Indian stock markets) తీవ్రంగా కుదిపేశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, చమురు ధరలు పెరగడం వల్ల సూచీలు దారుణంగా పడిపోయాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్ల వరకు పతనమైంది.
Also Read: భీకర యుద్ధం.. టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రిపై దాడులు.. షాకింగ్ వీడియో
After Iran Strikes Stock Market Falls
సోమవారం ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్ 1,048.48 పాయింట్లు పడిపోయి 80,238.71కి చేరింది. ఇక నిఫ్టీ 307.35 పాయింట్లకు దిగజారి ప్రస్తుతం 24,871.30 వద్ద కొనసాగుతోంది. మరోవైపు రూపాయి విలువ కూడా భారీగా పడిపోయింది. ఈరోజు సెషన్‌లో 24 పైసలు తగ్గి 91.32 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ప్రీ ట్రెడింగ్‌లో సెన్సెక్స్ దాదాపు 2700 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 530 పాయింట్లు కుంగింది. దీంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: ఖమేనీ మరణం.. ఇరాన్ మసీదుపై ఎర్ర జెండా.. ఎందుకో తెలుసా ?
మరోవైపు చమురు, సహజవాయువు రవాణాకు కీలకంగా ఉండే హార్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేసింది. ప్రపంచ చమురులో దాదాపు 20 శాతం ఈ మార్గం నుంచే రవాణా అవుతోంది. భారత్‌కు దాదాపు 50 శాతం చమురు దిగుమతి ఈ మార్గం నుంచే వస్తుంది. దీన్ని ఇరాన్ మూసివేయడంలో చమురును రవాణా చేసే నౌకలు వేరే మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల రవాణా ఖర్చులు, బీమా వ్యయాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం చూసుకుంటే బ్యారెల్ ముడిచమురు ధర 70-73 డాలర్ల వద్ద ఉంది. అయితే యుద్ధ వాతావరణం వల్ల 90-100 డాలర్ల స్థాయికి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. - stock-markets
Follow Us