Viral Video: 5 ఏళ్ల చిన్నారిని చంపేసిన మూఢ నమ్మకం.. కన్నకొడుకుకే నీటిలో ముంచి హతమర్చిన తల్లిదండ్రులు!
మూఢనమ్మకం హరిద్వార్‌లో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. క్యాన్సర్ బారిన పడ్డ పిల్లాడిని రోగాన్ని నయం చేయడం కోసమంటూ గంగనదిలో పదేపదే ముంచారు తల్లిదండ్రులు. దీంతో పిల్లాడు చనిపోయాడు. అయితే చిన్నారిని కుటుంబీకులే కావాలనే నీట ముంచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.