Breaking: సొనియా గాంధీకి అస్వస్థత.. CWC సమావేశానికి దూరం

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో కర్ణాటకలో బెలగావిలో జరగనున్న సమావేశాలకు ఆమె దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

New Update
Sonia Gandhi

Sonia Gandhi


కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో కర్ణాటకలో బెలగావిలో జరగనున్న సమావేశాలకు ఆమె దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనియా గాంధీ వెంట కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఒకవేళ ఆమె ఆరోగ్యం కుదుటపడకపోతే ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశాలకు వెళ్లకపోవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ మాత్రమే ఈ సమావేశంలో పాల్గొననున్నారని పేర్కొన్నాయి.   

Also Read: ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు.. ఈ ఏడాదిలో పొలిటికల్ హైలెట్స్ ఇవే!

ఇదిలాఉండగా.. కర్ణాటకలో బెలగానిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమవేశాలు జరుగుతున్నాయి. ఈ మీటింగ్‌కు నవ సత్యాగ్రహ భైఠక్‌ అని పేరు కూడా పెట్టారు. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ సీఎంలతో పాటు ప్రత్యేక ఆహ్వనితులు హాజరుకానున్నారు. అయితే మొత్తంగా ఈ మీటింగ్‌లో 200 మంది నేతలు పాల్గొమటారని AICC తెలిపింది.  

Also Read: కాంగ్రెస్‌ను ఇండియా కూటమి నుంచి తొలగించాలి.. ఆప్‌ షాకింగ్ కామెంట్స్

అయితే గురువారం మధ్నాహ్యం  సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఇక శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు్న్నారు. అలాగే వచ్చే ఏడాదిలో పార్టీ తీసుకోవాల్సిన కార్యచరణపై కూడా కీలక చర్చలు జరపనున్నారు. 

Also Read: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం

Also Read: ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు

Advertisment
తాజా కథనాలు