Liquor Scam Case : ఎమ్మెల్సీ కవిత సీబీఐ ఛార్జిషీట్‌పై విచారణ వాయిదా
లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేజీలు సరిగ్గా లేవని నిందితుల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది కోర్టు.