Weather Update: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి నలుగురు స్పాట్ డెడ్

సిక్కింలో విషాదం చోటుచేసుకుంది. రాంబీలో కొండచరియలు విరిగిపడటంతో 4గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.

New Update
sikkim rambi landslide 3 killed people injured hospitalised

sikkim rambi landslide 3 killed people injured hospitalised

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ భారీ వర్షాల(Heavy Rains) కారణంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరెంట్ షాక్, చెట్లు విరిగిపడి.. ఇలా ఎంతో మంది పలు కారణాలవల్ల ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి విషాదకర ఘటన మరొకటి చోటుచేసుకుంది. 

Also Read :  ప్రమాదాలకు చెక్‌.. ఇకనుంచి విమానాలకు ఎయిర్‌ బ్యాగ్స్‌

Sikkim Rambi Landslide

సిక్కిం(Sikkim) లో దారుణం జరిగింది. యాంగ్‌తాంగ్ నియోజకవర్గంలోని ఎగువ రింబిలో నిన్న రాత్రి భారీ కొండచరియలు(Landslides) విరిగిపడ్డాయి. ఈ ఊహించని ప్రమాదం కారణంగా వరద నీరు ఉప్పొంగింది. దీంతో దిగువన ఉండే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకవైపు వరద నీరు, మరోవైపు కొండచరియలు విరిగి ఇళ్లపై పడటంతో స్పాట్‌లో నలుగురు మరణించారు. అదే సమయంలో మరో ముగ్గురు తప్పిపోయారు. 

ప్రస్తుతం వారికోసం గ్రామస్తులు, SSB సిబ్బంది కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో పొంగిపొర్లుతున్న హ్యూమ్ నదిపై పోలీసులు, స్థానిక ప్రజలు చెక్క దుంగలతో తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించారు. దీని ద్వారా ఇద్దరు మహిళలను రక్షించారు. వారు తీవ్రంగా గాయపడ్డారు. 

అనంతరం కొండచరియలు విరిగిపడటం గురించి ఎస్పీ గెజింగ్ షెరింగ్ షెర్పా మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా పర్వతాలు పగుళ్లు ఏర్పడి, భారీ కొండచరియలు విరిగిపడ్డాయని, దీని కారణంగా శిథిలాలు, రాళ్ళు నీటితో పాటు వచ్చాయని చెప్పారు. నీటి కారణంగా, హ్యూమ్ నది ఉప్పొంగి ప్రవహించి, నీరు ఇళ్లలోకి ప్రవహించి కొట్టుకుపోయిందని అన్నారు. గాయపడిన ఇద్దరు మహిళలను జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే చికిత్స పొందుతూ ఒక మహిళ మరణించిందని.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. 3 మంది గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇదిలా ఉంటే తూర్పు రాష్ట్రాల్లో 6 రోజులు వాతావరణం ఇలాగే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ సహా పరిసర ప్రాంతాలలో తుఫాను వచ్చే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 12 నుంచి 17 మధ్య అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 16 వరకు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 12, 15 మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read :  ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి

Advertisment
తాజా కథనాలు