/rtv/media/media_files/2025/09/12/engineers-unveil-bonkers-prototype-for-crash-proof-plane-following-air-india-disaster-2025-09-12-08-23-25.jpg)
Engineers unveil bonkers prototype for crash-proof plane following Air India disaster
ఈమధ్యకాలంలో వరుసగా విమాన ప్రమాదాలు(Flight Accidents) జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో విమాన ప్రయాణం చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత విమాన ప్రయాణికుల సంఖ్య చాలావరకు తగ్గినట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు ఓ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ప్రమాదం జరిగినప్పుటు కార్లకు ఎయిర్‌బ్యాగులు ఎలా తెరుచుకుంటాయో విమానాలకు కూడా ఎయిర్‌బ్యాగ్‌లతో రక్షణ కల్పించే టెక్నాలజీని ఇంజినీర్లు దర్శన్, ఎషెల్ వాసిమ్ తీసుకొచ్చారు.
Also Read: భారత్, అమెరికాల మధ్య సంధి.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..మంత్రి పియూష్ గోయల్
అయితే వీళ్లు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(BITS) పిలానీకి చెందిన దుబాయ్ క్యాంపస్‌కు చెందినవారు. 'ప్రాజెక్ట్ రీబర్త్' పేరుతో దీన్ని తయారుచేశారు. జేమ్స్ డైసన్ అవార్డు కోసం పోటీలో ఫైనల్స్‌కు చేరినదాంట్లో ఈ ప్రాజెక్టు కూడా ఉంది. దాని అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రాజెక్ట్ రీబర్త్ మొదటి ఏఐ పవర్డ్ క్రాష్ సర్వైవల్‌సిస్టమ్ అని తెలిపారు. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందని.. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేదుకే ఈ సాంకేతికతను అభివృద్ధి చేశామని ఆ ఇంజినీర్లు పేర్కొన్నారు.
Also Read: అధ్యక్షుడు ఒకలా..వాణిజ్య మంత్రి మరొకలా..రష్యా చమురు కొనుగోలు ఆపితేనే చర్చలని ప్రకటన
ఎలా పనిచేస్తుంది
ప్రాజెక్టు రీబర్త్‌లోని ఏఐ సిస్టమ్ విమానం ఎగిరే ఎత్తు, వేగం, ఇంజిన్ పరిస్థితి, అగ్ని ప్రమాదం, పైలట్ స్పందన ఇలాంటివన్నీ పర్యవేక్షిస్తుంది. రాబోయే అత్యవసర పరిస్థితిని గుర్తించి తనంతట అదే నిర్ణయం తీసుకోగలుగుతుంది. వినానం 3 వేల అడుగుల కన్నా ఎత్తులో ఉండి, కూలిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ సిస్టమ్ పనిని ప్రారంభిస్తుంది. ఈ దశలో కూడా పైలట్ తమ ఆదేశాలు అమలు చేయొచ్చు. ఆ సమయంలో హైస్పీడ్ ఎయిర్‌బ్యాగ్స్ అనేవి విమానం ముందుభాగం, మధ్యభాగం, తోక భాగాల్లో రెండు సెకండ్లలోనే తెరుచుకుంటాయి. ఇక విమానం నేలను తాకే సమయానికి ఆ బ్యాగులు మొత్తం తెరుచుకొని రక్షణ కవచంగా మారుతాయి. దీంతో చాలావరకు ప్రమదాన్ని తగ్గించవచ్చు. ఒకవేళ విమానం భవనాలపై పడితే మరి వాటికి నష్టం జరుగుతుందా ? లేదా అనేది క్లారిటీ లేదు.
Also Read: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దేశవ్యాప్తంగా 8మంది ఉగ్రవాదుల అరెస్ట్..!
ఈ సాంకేతికతను ప్రస్తుత విమానాలతో సహా కొత్తగా తయారు చేసే విమానాల్లోకి కూడా తీసుకురావొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని పరీక్షల కోసం ఏరోస్పేస్ ల్యాబ్స్(Aerospace Labs) తో భాగస్వాములం అవుతామని ఈ ఇంజినీర్లు తెలిపారు. ప్రస్తుతం చూసుకుంటే చాలావరకు విమాన భద్రత వ్యవస్థలు విమానాన్ని కూలిపోవడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు సజీవంగా బయటపడటం చాలా కష్టం. కానీ తాము రూపొందించిన ప్రాజెక్ట్ రీబర్త్ ద్వారా మిగిలిన భద్రతా వ్యవస్థలు విఫలమైనప్పుడు ఇది యాక్టివేట్ అవుతుందని దీనివల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడేందుకు అవకాశం ఉంటుందని ఇంజినీర్లు వెల్లడించారు.