/rtv/media/media_files/2025/10/13/a-young-man-slipped-while-crossing-the-track-on-his-bike-2025-10-13-18-36-17.jpg)
A young man slipped while crossing the track on his bike
Crossing Railway Track: ప్రమాదాలనేవి చెప్పిరావు. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన ప్రమేయం లేకుండానే ప్రాణాల మీదకు రావచ్చు. అయితే కొంతమంది మాత్రం తెలిసీ తెలిసి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు దాటే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. రెండు నిమిషాలు ఆగి వెళ్లడానికి ఓపిక లేక రైలు వచ్చేలోగా వెళ్లిపోమా అన్న దోరణిలో ట్రాక్ దాటుతుంటారు. అలాంటి సమయంలోనే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.
देखिये जल्दबाजी का नतीजा कितना खतरनाक है, ग्रेटर नोएडा में रेलवे फाटक पर बाइक फिसलने से युवक ट्रैक पर गिर गया और ट्रेन की चपेट में आकर उसकी मौत हो गई। सुरक्षा नियमों की अनदेखी की कीमत इतनी भारी चुकानी पड़ी । pic.twitter.com/YpBIC8g6Gf
— गुरु प्रसाद यादव, लखनऊ (@guruprasadyada5) October 13, 2025
Also Read : RSS నుంచి లైంగిక వేధింపులు.. IT ఉద్యోగి సూసైడ్.. వెలుగులోకి సంచలన విషయాలు!
Train Acccident In Uttar Pradesh Greater Noida
అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్‌తో ట్రాక్ దాటుతున్న ఓ యువకుడు ట్రాక్ పై జారిపడడంతో..రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి(train accident news) చెందడం అందరిని కలిచివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని గ్రేటర్ నోయిడా(greater-noida) లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం గ్రేటర్ నోయిడాకు చెందిన తుషార్ అనే యువకుడు బైక్‌పై..దాద్రి రైల్వే ట్రాక్ వద్దకు వచ్చాడు. అయితే రైలు రావడానికి ఇంకా కొంత సమయం ఉండడంతో బైక్‌పైనే ట్రాక్‌ను దాటడానికి ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో అనుకోకుండా బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌తో పాటు రైలు పట్టాలపై పడిపోయాడు. వెంటనే తేరుకొని బైక్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే..రైలు దగ్గరకు వచ్చింది. దాన్ని గ్రహించి పక్కకు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది.
అప్పటికే సమీపానికి వచ్చిన రైలు తుషార్‌ను ఢీకొట్టడంతో తుషార్ అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ట్రాక్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకొని..దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అదే సమయంలో రైల్వేట్రాక్‌లు దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. గేట్ వేసిఉన్న సమయంలో ట్రాక్‌పై నుంచి దాటడానికి ప్రయత్నించొద్దని ప్రజలకు వారు సూచించారు.
Also Read: Cough Syrup Tragedy: దగ్గుమందు మరణాలు.. కంపెనీకి బిగ్ షాక్..