RSS నుంచి లైంగిక వేధింపులు.. IT ఉద్యోగి సూసైడ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

కేరళలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన ఐటీ ఉద్యోగి అనంతు అజి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అనంతు అజీ ఒసిడి, ఆందోళన, భయాందోళనలు సహా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వర్గాలు తెలిపాయి

New Update
rss

కేరళ(kerala) లో ఇటీవల ఆత్మహత్య(suicide) చేసుకుని మరణించిన ఐటీ ఉద్యోగి అనంతు అజి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అనంతు అజీ ఒసిడి, ఆందోళన, భయాందోళనలు సహా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వర్గాలు తెలిపాయి. అతను క్రమం తప్పకుండా  కౌన్సెలింగ్ పొందుతున్నాడని వెల్లడించాయి.  

Also Read :  ఎన్నికల వేళ నితీష్ కుమార్ కు కోలుకోలేని దెబ్బ!

పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని

అనేక మంది RSS సభ్యులు తనపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో తుది పోస్ట్ పెట్టిన తర్వాత ఆనంతు అజి  ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని,  తాను ఒక్కడినే బాధితుడిని కాదని, దేశమంతటా RSS శిబిరాల్లో ఇటువంటి సంఘటనలు విస్తృతంగా జరుగుతున్నాయని ఆరోపించాడు. 

Also Read :  దగ్గుమందు మరణాలు.. కంపెనీకి బిగ్ షాక్...

అనంతు సుమారు ఐదేళ్లుగా సంఘ్‌కు దూరంగా ఉన్నాడు. కాలేజీలో చేరిన తర్వాత ఈ దూరం పెరిగింది. అనంతు అజిచివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పలు సార్లు ఎడిట్ చేయబడి, జాగ్రత్తగా షెడ్యూల్ చేయబడినట్లు కనిపిస్తోందని, ఆ పోస్ట్‌ను ఆయనే రాశారా లేదా ఏదైనా మూడవ పక్షం జోక్యం ఉందా అనేది సాంకేతికంగా ధృవీకరించాలని RSS వర్గాలు కోరాయి. 

అనంతు కుటుంబంలో కూడా సమస్యలు ఉన్నాయని, ఆయన సోదరి ఒక ముస్లిం వ్యక్తితో ప్రేమ సంబంధంలో ఉండటం, వారి తండ్రి మరణం తర్వాత కుటుంబం సంఘ్ స్నేహితులకు దూరంగా ఉండటం వంటి విషయాలు కూడా ఆయన ఒత్తిడికి కారణమై ఉండవచ్చని RSS వర్గాలు పేర్కొన్నాయి. అనంతు అజి తన చివరి సోషల్ మీడియా పోస్ట్‌లో, బాల్యంలో RSS సభ్యులచే జరిగిన లైంగిక వేధింపుల కారణంగానే తన మానసిక సమస్యలు (OCD తో సహా) పెరిగాయని స్పష్టంగా ఆరోపించారు. 

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సహా రాజకీయ నాయకులు ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.  దేశమంతటా ఆర్‌ఎస్‌ఎస్ శిబిరాలకు హాజరయ్యే పిల్లలు, యువకులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కేసుపై కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు