Gold Silver Rate: షాకింగ్ న్యూస్... బంగారాన్ని మించి వెండి పరుగులు

బంగారం ధరతో పోలిస్తే వెండి రేటులో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. అంతేకాదు వెండి ధరలు భవిష్యత్తులో పెరుగుతాయని నిపుణులు హెచ్చరించడంతో అనేక మంది బంగారం కంటే ఎక్కువగా వెండిపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి.

New Update
Gold and silver

Gold and silver Photograph: (Gold and silver)

 Gold Silver Rate: శుభకార్యాలు ఏవైనా అందరికీ గుర్తుకు వచ్చేది బంగారమే. కానీ ఇటీవల అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. బంగారంతో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది.గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ వచ్చాయి. కానీ ఆదివారం రోజు మాత్రం ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. 

ఇది కూడా చూడండి:డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!

దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు కొంతవరకు బ్రేక్ పడింది. ఆదివారం (మే 4, 2025న) రోజు వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో వీటి ధరలను గమనిస్తే ధరల పెరుగుదలపై అవగాహన వస్తుంది.బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా పసిడి ధరలపై ప్రభావం చూపుతుంది.

ఇది కూడా చూడండి:హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!

ప్రస్తుతం వీటి ధరలు (మే 4న) గుడ్‎రిటర్న్స్ వెబ్‎సైట్ ప్రకారం ఉదయం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,551గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 87,541 ఉంది. ఇదే సమయంలో గత వారం అంటే ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,210 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.90,010గా ఉంది. అంటే గత వారం రోజుల్లో వీటి ధరలు రూ.270 తగ్గాయి. రేట్లు భారీగా ఉన్నప్పటికీ అక్షయ తృతీయ సందర్భంగా భారతదేశంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరిగాయి. దాదాపు 12 టన్నుల బంగారం, 4,000 కోట్ల విలువైన వెండి అమ్ముడైంది. కానీ పండుగ తర్వాత డిమాండ్ తగ్గడం ధరల స్థిరత్వానికి దారితీసింది.

ఇది కూడా చూడండి:కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

వెండి ధరలు ఇలా

ఇక వెండి విషయానికి వస్తే గత వారం రోజుల్లో భారీగా పెరగడం విశేషం. అంటే మే 4, 2025న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,09,000గా ఉండగా, గత వారం ఏప్రిల్ 27, 2025న కేజీ వెండి ధర రూ.1,01,900గా ఉంది. ఈ క్రమంలో వారం రోజుల్లో ఏకంగా రూ.7100 పెరిగింది. ఈ నేపథ్యంలో బంగారం ధరతో పోలిస్తే వెండి రేటులో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. అంతేకాదు వెండి ధరలు భవిష్యత్తులో పెరుగుతాయని నిపుణులు హెచ్చరించడంతో అనేక మంది బంగారం కంటే ఎక్కువగా వెండిపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి ధరలు గోల్డ్ రేట్లను బీట్ చేశాయి.

ఇది కూడా చూడండి: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

Advertisment
తాజా కథనాలు