MLA Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన పనికి మంత్రి లోకేష్ ఫిదా.. రాష్ట్ర చరిత్రలోనే ఇదో అరుదైన రికార్డంటూ ట్వీట్!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. వారంలో మరో 198 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమంటూ కోటంరెడ్డిని ప్రశంసిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.

New Update
Kotam Reddy Sreedhar Reddy

Kotam Reddy Sreedhar Reddy

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలో ఒకే రోజు 105 అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేపట్టి రికార్డు సృష్టించారు. తరువాత వారం పాటు మరో 198 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 60 రోజుల్లో ఈ అభివృద్ధి పనులను పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఈ గొప్ప అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడికి, ప్రోత్సహిస్తున్న నారా లోకేష్‌ కు ధన్యవాదాలు తెలిపారు. వారు ఇచ్చే ఈ ప్రోత్సాహంతో భవిష్యత్ లో కూడా నెల్లూరు రూరల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరింత అంకిత భావంతో పని చేస్తానన్నారు.  

105 శంకుస్థాపనలు live

Posted by Kotamreddy Sridhar Reddy on Saturday, March 8, 2025

మంత్రి లోకేష్ ట్వీట్..

మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై స్పందించారు. కోటంరెడ్డిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  నేతృత్వంలో ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారన్నారు. బహుశా దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. ప్రజాప్రతినిధులకు స్పూర్తిగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు