Dharmasthala Mass Burial Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. తవ్వకాల్లో దొరకని అస్తికలు.. ఎంత తవ్వుతున్న మట్టే!

మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రాంతంలో సిట్ తవ్వకాలు జరపగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. తవ్వకాలు జరిపిన సిట్‌కు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, అస్థికలు, ఎముకలు లభించలేదు. తవ్వుతున్న కొద్ది మట్టే వస్తుందని తెలుస్తోంది.

New Update
dharmasthala

Dharmasthala mass burial case

ధర్మస్థల కేసు(Dharmasthala Case) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నో వందలాది శవాలను పూడ్చి పెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తెలిపిన విషయం తెలిసిందే. అయితే అతను చెప్పిన ప్రాంతాల్లో సెట్ తవ్వకాలు కొనసాగించగా ముందు పుర్రె, ఎముకలు, అస్థికలు లభించాయి. ఆ తర్వాత మళ్లీ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు మరో ప్రాంతం చూపించాడు. కానీ ఇందులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. తవ్వకాలు జరిపిన సిట్‌కు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, అస్థికలు, ఎముకలు లభించలేదు. తవ్వుతున్న కొద్ది మట్టే వస్తుంది. పారిశుద్ధ్య కార్మికుడు ఈ ప్రదేశాల్లో తాను వందకు పైగా మృతదేహాలను పాతిపెట్టినట్లు తెలిపాడు. అయితే కొన్ని దశబ్దాల కిందట కనిపించకుండా పోయినా ఓ విద్యార్థిని ఇంటి దగ్గర తవ్వకాలు చేపట్టారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. సిట్ అధికారులు తవ్వకాలు చేస్తున్న చోటుకు ఉప్పుమూటల్ని తీసుకువెళుతున్నారు. దొరికిన వాటిని సంచుల్లో ఉంచి వాటికి ఒక వైట్ కలర్ వస్త్రాన్ని చుడుతున్నారు. ఆ తర్వాత వీటిని బెంగళూరులోని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపుతున్నారు. అయితే పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన మొత్తం 13 ప్రాంతాల్లో తవ్వకాలు చేయాలంటే ముందుగా జీపీఆర్‌ పరికరాన్ని వినియోగించాలి. అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. దీంతో తవ్వకాలు కాలేదు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే తవ్వకాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:Dharmasthala Mass Burial Case: మాజీ పారిశుద్ధ్య కార్మికుడితో పాటు మరో 6 గురు.. ధర్మస్థల క్షేత్రంలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!

మరో ఆరుగురు..

మాజీ పారిశుద్ధ్య కార్మికుడితో పాటు మరో ఆరుగురు కూడా ఈ కేసులో నిజాలు చెబుతున్నారు. వారు కూడా మృతదేహాలను ఖననం చేసినట్లు తెలిపారు. అయితే వీరు ముందుగా కంప్లైంట్ ఇవ్వకుండా ఇన్ని రోజులు వీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ధర్మస్థల పుణ్యక్షేత్రంలో సిట్ 13 ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఇందులో ఆస్థిపంజరాల ఆనవాళ్లు, వస్తువులు లభ్యమయ్యాయి. వీటిలోనే కాకుండా మిగతా ప్లేస్‌లో కూడా తవ్వకాలు చేపట్టారు. అయితే ఈ నేత్రావతి నది పరిసర ప్రాంతాలు అన్ని కూడా 15 ఏళ్లలో పూర్తిగా మారిపోయాయి. 

వెలుగులోకి ఎలా అంటే?
ఇక్కడ పనిచేసే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు మహిళలను ఈ ప్రదేశంలో పూడ్చినట్లు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. 1995 నుంచి 2014 టైమ్‌లో ఇలా పూడ్చిపెట్టినట్లు తెలిపారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోంది.

అనుమానాలు  ఈ కేసుతోనే..
కొన్నేళ్ల కిందట ఓ వైద్య విద్యార్థిని అనుమానాస్పదంగా కనిపించలేదు. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. అయితే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపింది.

ఇది కూడా చూడండి: Dharmasthala Mass Burial Case: ధర్మస్థల పుణ్యక్షేత్రంలో క్షుద్రపూజల కలకలం.. అమ్మాయి కనిపిస్తే నరబలి.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

Advertisment
తాజా కథనాలు