Union Minister Piyush Goyal: ట్రంప్‌కు భారత్ బిగ్ షాక్.. బెదిరింపులకు భయపడదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకం విధించిన తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఉడత ఊపులకు భారత్ భయపడదని, ఎన్ని టారీఫ్‌లు వేసినా వెనక్కి తగ్గేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

New Update
Piyush Goyal

Piyush Goyal(Twitter)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. దీని తర్వాత ట్రంప్ భారత్‌ను బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే వీటికి భయపడేది లేదని ట్రంప్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉడత ఊపులకు భారత్ భయపడదని, ఎన్ని టారీఫ్‌లు వేసినా వెనక్కి తగ్గేది లేదని భారత్ రిటర్న్ వార్నింగ్ ఇచ్చింది. వాణిజ్య ఒత్తిళ్లకు భారత్ వెనకడుగు వేయదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారత్ 6.5 శాతం వృద్ధితో దూసుకెళ్తోంది. ఎన్ని టారీఫ్స్ వేసుకున్నా ఈ ఏడాది ఎగుమతులు పెరుగుతాయని గోయల్ అన్నారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌ - EFTA తో 100 బిలియన్ల పెట్టుబడులు, 10 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు లభిస్తాయయని గోయల్ అన్నారు. అనేక దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నామని గోయల్ తెలిపారు. 

ఇది కూడా చూడండి:Good news: గ్యాస్ రాయితీపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్...వారికి మరో ఏడాది అవకాశం

వాణిజ్యపరంగా వృద్ధి చెందుతుందని..

ప్రపంచ వాణిజ్య సంఘాలతో భారతదేశం అభివృద్ధి సాధిస్తోంది. ప్రతీ ఏటా ఆరున్నర శాతం వృద్ధి చెందుతోందని పీయుష్ గోయల్ అన్నారు. వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి ఇప్పటికే చర్యలు అమలులో ఉన్నాయని తెలిపారు. భవిష్యత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడుతూ, భారతదేశ విధానం కేవలం సుంకాల రాయితీలను కోరడం కంటే ఎక్కువగా అభివృద్ధి చెందిందని గోయల్ అన్నారు. నాలుగు దేశాల EFTA కూటమితో జరిగిన చర్చలను తెలపుతూ.. USD 4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని పీయూష్ గోయల్ తెలిపారు.

ఇది కూడా చూడండి: Rahul Gandhi: ఎన్నికల సంఘానికి రాహుల్‌ గాంధీ వార్నింగ్.. 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్

అక్టోబర్ 1వ తేదీ నుంచి EFTA ఒప్పందం అమల్లోకి రానుందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం యుఎఇ, మారిషస్, ఆస్ట్రేలియా, ఇఎఫ్‌టిఎ బ్లాక్, యుకె, ఇయు, చిలీ, పెరూ, న్యూజిలాండ్, యుఎస్ మరిన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుందని గోయల్ అన్నారు. భారతదేశం ఆర్థిక స్థితిస్థాపకతను హైలైట్ చేస్తూ, దేశ కరెన్సీ, విదేశీ మారక నిల్వలు, స్టాక్ మార్కెట్లు, ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని తెలిపారు. ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ద్రవ్యోల్బణం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి గొప్ప నాయకుడు నేతృత్వంలో భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతూ గౌరవంగా ఉందన్నారు.

Advertisment
తాజా కథనాలు