/rtv/media/media_files/2025/10/18/fastag-annual-pass-can-now-be-gifted-as-diwali-present-2025-10-18-18-24-04.jpg)
FASTag annual pass can now be gifted as Diwali present
దేశంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాదారులకు ఫాస్టాగ్ వార్షిక టోల్‌పాస్‌ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ వార్షిక టోల్‌పాస్‌ను మీకు నచ్చిన వాళ్లకి బహుమతిగా ఇవ్వొచ్చని పేర్కొంది. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజమార్గ అనే యాప్ ద్వారా ఈ పాస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చని తెలిపింది.
Also Read: తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
FASTag Annual Pass Gifted As Diwali
ముందుగా ఈ యాప్‌లో యాడ్ పాస్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ మీరు వార్షిక పాస్‌ను ఎవరికి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ల వాహన నెంబర్, కాంటక్ట్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది. దేశంలో ఉన్న 1150 టోల్‌ప్లాజాల వల్ల ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ పనిచేస్తుంది. ఒక్కసారిగా రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ పాస్‌తో ఏడాది పాటు లేదా 200 సార్లు టోల్ ప్లాజాలు దాటొచ్చు. ఈ రెండింట్లో ఏది ముందు అవుతుందో అప్పటికీ ఆ పాస్ గడువు ముగుస్తుంది.
Also read: విమానం గాల్లో ఉండగా మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు.. VIDEO
అంతేకాదు ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది కేవలం ప్రైవేట్ నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. రాజమార్గ యాప్‌లో దీన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత కేవలం రెండు గంటల్లోనే ఈ పాస్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ ఫాస్టా్గ్ పాస్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ప్రారంభమైన రెండు నెలల్లోనే ఏకంగా 25 లక్షల మంది దీన్ని ఎంపిక చేసుకున్నారు. మొత్తం 5.67 కోట్ల లావాదేవీలు జరిగినట్లు NHAI పేర్కొంది.
Also Read: మంటల్లో కాలిబూడిదైన ట్రైన్.. గజగజ వణికిపోయిన ప్రయాణికులు