Sri Chaithanya Institution : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నైలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజు తీసుకుని ట్యాక్స్ ఎగొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేసి లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా కాలేజీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అందులో హైదరాబాద్ మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలోనూ సోదాలు నిర్వహించారు.
Also read: jagga reddy: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్‌లో
కాగా నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ఈ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో పలువురు తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేశారు. ఫీజుల విషయంలోనూ ఫిర్యాదుల రావడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏకకాలంలో దేశంలోని పలు నగరాలలో ఉన్న ఈ కాలేజీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కాలేజీలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తేలింది. అదేవిధంగా పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. అయితే సోదాల్లో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. మాదాపూర్‌లోని శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలో రికార్డులు, డాక్యుమెంట్లు, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపు రశీదులను పరిశీలించారు. డైరెక్టర్ల కార్యాలయాలనూ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
Also read: MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
కాగా ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చైతన్య విద్యాసంస్థలపై రెండు సార్లు ఐటీ దాడులు నిర్వహించగా మరోసారి దాడులు చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్, విజయవాడలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రికార్డులన్నింటిని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ చైతన్య కాలేజీ డైరెక్టర్ లతోపాటు మేనేజర్ లైన్ లో సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడ కార్పోరేట్ కళాశాలల సెంట్రల్ ఆఫీస్ లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. విజయవాడలోని శ్రీచైతన్య ,నారాయణ సెంట్రల్ ఆఫీస్ లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున 5 గంటల నుంచే పెద్ద సంఖ్యలో అధికారులు పలు రికార్డలు స్వాధీనం చేసుకుని విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం. విద్యార్థుల ఫీజుల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలకు సంబంధించిన న్యాయబద్ధంగా కట్టాల్సిన పన్ను ఎగవేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
Also Read : కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
గత కొంతకాలంగా..నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో జరుగుతున్న అడ్మిషన్లు, వ్యాపార లావాదేవీల్లో వెల్లడించిన వివరాలు వేరేగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. దీంతో పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే..ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. కంప్యూటర్స్ హార్డ్ డిస్క్, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో తెల్లవారుజామున ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి..రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ల నివాసాలు, హైదరాబాద్ లో ఉన్న ప్రధాన కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కళాశాలల యజమాన్యాలు వెల్లడించిన వివరాలు, సోదాల్లో లభించిన వివరాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం.
Also Read : నీ కోసం జీవితాంతం ఎదురు చూస్తానని.. యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్