jagga reddy: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్‌లో

కాంగ్రెస్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అని సినిమా పేరు ఫిక్స్ అయ్యింది. స్వయంగా జగ్గారెడ్డే ఆ మూవీ పోస్టర్, అప్‌డేట్స్ చెప్పారు. వచ్చే ఉగాదిలోగా సినిమా లిరీజ్ అవుతుందని అన్నారు.

New Update

కాంగ్రెస్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అని సినిమా పేరు ఫిక్స్ అయ్యింది. స్వయంగా జగ్గారెడ్డే ఆ మూవీ పోస్టర్, అప్‌డేట్స్ చెప్పారు. వచ్చే ఉగాదిలోగా సినిమా లిరీజ్ అవుతుందన్నారు. పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి అనుమతితోనే సినిమాల్లోకి వస్తున్నానని ఆయన స్ఫష్టం చేశారు.

ఆయన క్యారెక్టర్‌కు తగ్గట్టుగా సినిమాలో పాత్ర ఉంటుందని రివీల్ చేశారు. ఇంటర్వెల్ ముందు నుంచి మూవీ చివరి వరకూ జగ్గారెడ్డి పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి సినిమా పోస్టర్‌లో ఆయన మాస్, ఫ్యాక్షన్ హీరో క్యారెక్టర్‌గా కత్తులతో కనిపిస్తున్నారు. బాలయ్య రేంజ్‌లో పోస్టర్ కటౌట్ ఉంది. జగ్గారెడ్డి నటిస్తున్న సినిమాలో లవ్ స్టోరీ ఉంటుందట. ఈ సినిమాకి వడ్డి రామానుజం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. 

Also read: Pranay murder case: ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’

జగ్గారెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమిపాలు అయ్యాడు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థినే అని చెప్పుకున్నారు. తీరా ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓడిపోయారు. కొన్నిరోజులుగా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కూడా ఆయనకు దక్కలేదు. దీనిపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఎప్పుడూ ఆయన ఎమ్మెల్సీ కోరుకోలేదని అన్నారు. కొన్ని నెలల క్రితం మహిళా కలెక్టర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. విధులకు హాజరుకాలేదని కలెక్టర్‌తో దురుసుగా మాట్లాడారు.  

Also read: Vijayanagaram: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు