హెడ్‌ మాస్టర్‌ను హత్య చేసిన ఉపాధ్యాయులు !

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో పనిచేసే హడ్‌మాస్టర్‌ను తోటీ ఉపాధ్యాయులే ప్లాన్ చేసి హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
MURDER PLAN


మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో పనిచేసే హడ్‌మాస్టర్‌ను తోటీ ఉపాధ్యాయులే ప్లాన్ చేసి హత్య చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సురేంద్ర కుమార్(55) అనే వ్యక్తి హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రతీరోజు లాగే విధులు నిర్వహించేందుకు స్కూల్‌కు వచ్చారు.   

Also read: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

సాయంత్రం సమయంలో ఆయన టాయిలెట్‌కు వెళ్లాడు. దీంతో అక్కడే కాపుకాసిన ఓ నిందితుడు తుపాకీతో బాత్‌రూంలో ఉన్న హెడ్‌మాస్టర్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ సౌండ్లు విని విద్యార్థులు, టీచర్లు భయాందోళనకు గురయ్యారు. బాత్రూంలో చూడగా.. సురేంద్ర కుమార్‌ రక్తపు మడుగులో పడిఉన్నారు. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. 

దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. తుపాకితో కాల్పులు జరిపింది ఇంటర్ చదివే విద్యార్థిగా గుర్తించారు. కాల్పుల తర్వాత ఆ నిందితుడు పారిపోయాడు. ఇతడు ధిలాపూర్‌ గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. అయితే ఆ విద్యార్థి గతంలో కూడా క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహించినట్లు తెలుస్తోందని'' పోలీసులు తెలిపారు.

Also read: రన్నింగ్ జెయింట్ వీల్‍కు వేలాడిన బాలిక.. వీడియో వైరల్

అయితే హెడ్‌మాస్టర్‌ సురేంద్ర సక్సేనా హత్య వెనుక ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులే ఉన్నట్లు తెలుస్తోంది. హత్యపై సురేంద్ర సోదరుడు రాజేంద్ర సక్సేనా మాట్లాడారు. '' సురేంద్రకి ముమ్మాటికి హత్యే. పాఠశాలలో పనిచేసే తోటి ఉపాధ్యాయులే ఈ దారుణానికి పాల్పడ్డారు. స్కూల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడిని తన సోదరుడిపై గత కొంత కాలంగా వీళ్లు ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయం గురించి సురేంద్ర పలుమార్లు నాకు చెప్పాడు. అవినీతి చేసేందుకు ఒప్పుకోకపోవడంతోనే హత్యకు ప్లా్న్ చేసి ఉంటారని'' రాజేంద్ర సక్సేనా అనుమానం వ్యక్తం చేస్తారు. మరోవైపు ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.  

Also Read: ఈ ఆలయానికి కేజీ బంగారం, రూ.23 కోట్ల విరాళాలు.. ఇంకా లెక్కుంది

Also Read: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Also Read: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు