VIRAL VIDEO: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి రెస్టారెంట్లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బిర్యాని తింటుండగా.. మధ్యలో ట్యాబ్లెట్లు కనిపించడం సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
BIRYANI

ఈ మధ్య కాలంలో క్వాలిటి ఫుడ్ విషయంలో పలు హోటళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కస్టమర్లకు అందించే ఫుడ్ విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటున్నాయి. ఒక్కో సందర్భంలో ఒకసారి వండిన ఫుడ్‌ను మిగిలిన తర్వాత ఫ్రిడ్స్‌లో పెట్టి మరుసటి రోజు కస్లమర్లకు అదే ఫుడ్ పెడుతున్నారు. అది ఒక్కోసారి వాసన రావడంతో బయట పడ్డాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొట్టాయి. 

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం

ఇంకొన్ని సార్లు తినే భోజనంలో పురుగులు, బొద్దింకలు, మిడతలు, సిగరెట్‌లు సహా మరెన్నో రావడం చూస్తూనే ఉన్నాం. ఆకలితో అలమటించిన కొందరు దగ్గర్లోని హోటల్‌కు వెళ్లి తిందాం అనుకున్నా ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుని వణికిపోతున్నారు. 

ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్‌ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!

బావర్చి హోటల్‌లో ట్యాబ్లెట్

ఏ ఫుడ్‌లో ఏది వస్తుందోనని కంగారు పడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న బావర్చి హోటల్‌లో షాకింగ్ ఘటన బయటకొచ్చింది. ఒక గ్యాంగ్ ఆకలితో ఆ హోటల్‌కి వెళ్లి బిర్యాని ఆర్డర్ చేసుకుంది. తింటుండగా మధ్యలో సిగరెట్ ముక్క కనిపించింది. దీంతో వారంతా షాక్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ

తాజాగా అలాటిదే మరొకటి జరిగింది. బిర్యానిలో ట్యాబ్లెట్లు కనిపించడం సంచలనంగా మారింది. అయితే ఇది మరెక్కడో జరగలేదు. బావర్చి హోటల్‌లోనే జరిగింది. అదీ క్రాస్ రోడ్డులో ఉన్న అదే బావర్చి హోటల్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తింటుండగా బిర్యానిలో ట్యాబ్లెట్ కనిపించింది. దీంతో అది గమనించిన ఆ వ్యక్తి దాన్ని వీడియో తీసాడు. అయితే అక్కడికి చేరుకున్న హోటల్ యాజమన్యం ఎందుకు వీడియో తీస్తున్నావని అతడిని దబాయించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు