రేషన్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసింది. కాకినాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
RATION MAFIA

Ration Rice: ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు మొత్తం ఆరుగురు సభ్యులతో ఈ సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు చీఫ్ గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్‌, డీఎస్పీలు అశోక్‌ వర్ధన్‌, గోవిందరావు, డీఎస్పీలు బాలసుందర్‌రావు, రత్తయ్యలను సిట్‌ సభ్యులుగా నియమించింది.

Also Read: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!

ఈ కేసు సంబంధించి అప్డేట్స్ ను ప్రతి 15 రోజులకోసారి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ సిట్‌ బృందానికి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తూ జీవో విడుదల చేసింది. ఒక్క కాకినాడలోని పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాపై 13 ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడం చర్చనీయాంశమైంది. కాగా కాకినాడ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారించనుంది. 

Also Read: నిఖేశ్‌కుమార్‌ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!

సీజ్ ద షిప్ అంటూ...

ఇటీవల కాకినాడలో పర్యటించారు పవన్ కళ్యాణ్. పోర్టు మార్గంలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అక్కడ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి కాకినాడ పోర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న స్టెల్లా అనే షిప్ ను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సీజ్ చేయాలని అధికారులకు ఇచ్చిన ఆదేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సీజ్ చేయడంపై కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చిన తాను చూసుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం పై సీఎం చంద్రబాబు కూడా మద్దతూ తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు తాజాగా సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

ALSO READ: కొత్త రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం!

ALSO READ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు రెండు రోజుల కస్టడీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు