ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందకు యత్నించారు.ఈ క్రమంలోనే పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికీ పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు వాళ్లపై టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు.

New Update
TEAR GAS


పంజాబ్,హర్యానా సరిహద్దులో రైతులు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పంటలకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన ఈ ఉద్యమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాళ్లని అడ్డుకున్నారు.  

Also Read: మహిళా హోంగార్డ్ కిర్రాక్ మోసం.. రిటైర్డ్ ఏఈ మార్ఫింగ్ ఫొటోలతో!

ఈ క్రమంలోనే పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు బారికేడ్లు దాటుకొని మరి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. చివరికీ పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు వాళ్లపై టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. ఇదిలాఉండగా.. పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర కల్పించే కొనేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.  

Also Read: ఉత్తరప్రదేశ్ లో ఘోరం.. జన్మనిచ్చిన కాసేపటికే లిఫ్ట్ కుప్పకూలి..

మోదీ గ్యారెంటీని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఉత్పత్తి ధరకంటే కనీసం 50 శాతం అధికంగా చెల్లించి పంటను కొనాలని ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్ సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ సిఫార్సులు పరిగణలోకి తీసుకోలేమని చెప్పిందని వివరించారు. కానీ మోదీ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు, సోయాబీన్ జొన్న పంటలకు ఉత్పత్తి ధర కంటే 50 శాతం అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తోందని అన్నారు.

Also Read: నేను అడిగితేనే షిండే అలా చేశారు.. ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు

Also Read: వడ్డీ రేట్లు యథాతథమే..ఎలాంటి మార్పులు లేవు:ఆర్బీఐ గవర్నర్‌!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు