/rtv/media/media_files/2024/12/06/jK9e9qkAPS9SlWFDkvuz.jpg)
ఓ ఆలయానికి భారీ మొత్తంలో విరాళాలు వచ్చాయి. రెండు నెలల తర్వాత గుడి హుండీ తెరిచి చూస్తే కేజీ బంగారం, రూ.23 కోట్లు లెక్కలోకి వచ్చాయి. రాజస్థాన్ చిత్తోర్ గఢ్ లో సన్వాలియా సేథ్ అనే ఆలయం ఉంది. ఇది కృష్ణ భగవాన్ దేశాలయం. చిన్న చిన్ని గోల్డ్ బిస్కెట్లు, వెండి హస్తకళాఖండాలు, ఆభరణాలు అందులో ఉన్నాయి. వెండి తాళాలు, వేణువులు, కడియాలు లాంటి శ్రీ కృష్ణ భగవాన్ ఆభరణాలు అందులో ఉన్నాయి. రెండు నెల తర్వాత గుడి హుండీ తెరిచారు. హుండీలో పెద్ద మొత్తంలో విరాళాలు ఉండటంతో దశల్లో లెక్కిస్తున్నారు.
ఇది కూడా చదవండి : TG: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్.. రేవంత్ ఆహ్వానం!
మొదటి దశలో రూ.11.34 కోట్లు, రెండవ దశ రూ.3.60 కోట్లు, మూడవ దశలో రూ.4.27 కోట్లు లెక్కించారు. ప్రస్తుతం రూ.19.22 కోట్లకు చేరుకుంది. ఇంకా లెక్కించడానికి విరాళాలు ఉన్నాయి. విరాళాల పెట్టెలు, ఆన్‌లైన్ విరాళాలు, గిఫ్ట్ రూమ్‌ల నుంచి సేకరించిన బంగారం, వెండి వస్తువుల కొలుస్తున్నారు. ప్రతి నెల అమావాస్య నిర్వహించే కౌంటింగ్ కంటే ఈ సారి 6, 7 రౌండ్లల్లో ఎక్కువగా జరిగింది.
ఇది కూడా చదవండి: భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లు.. బార్డర్ లో ఉద్రిక్తత!
ఈ ఆలయం చిత్తోర్ గడ్ నుంచి 40 కిలో మీటర్ల దూరంలో చిత్తోర్ గడ్ ఉదయ్ పూర్ హైవే పై ఉంది. సన్వాలియా సేథ్ ఆలయం వైష్ణవ భక్తుల పుణ్యక్షేత్రం. ఈ ఆలయం మూలాలు1840 కాలం నాటి నుంచి ఉన్నాయి. భోలారం గుర్జార్ అనే పాల వ్యాపారి కలలో వచ్చి అక్కడ కృష్ణుడు ఉన్నాడని చెప్పారు. అక్కడ తొవ్వి చూస్తే నిజంగానే కృష్ణుడి విగ్రహం ఉంది.
ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం
ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!