ఎగ్జిబిషన్ లో బెయింట్ వీల్ ఎక్కిన 13ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు సీటు నుంచి జారి ఐరన్ రాడ్స్ పట్టుకొని వేలాడింది. దాదాపు 60 అడుగుల ఎత్తులో కొన్ని సెకన్లపాటు బాలిక జెయింట్ వీల్ రాడ్స్ పట్టుకొని వేళాడుతూనే ఉంది. దానికి సంబంధించిన వీడియో డిసెంబర్ 5న ఎక్స్ లో పోస్ట్ అయ్యింది.
#WATCH | A 13-year-old girl dangled from a 60-foot Ferris wheel after slipping from her seat at a fair in UP, but was rescued by the operator. The ride was running without permission, and an investigation is underway.#UttarPradesh #Rescue #Safety pic.twitter.com/27ZQyNUvye
— Mojo Story (@themojostory) December 6, 2024
Also Read: సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1785 ఖాళీలు..అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే!
అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాకేహ్తి గ్రామంలో తిరునాళ్లుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పెద్ద జెయింట్ వీల్ స్సీడ్ గా తిరగడంతో బాలిక కుదుపునకు గురైంది. అమ్మాయి అదుపుతప్పి కూర్చొన్న సీటు నుంచి జారిపోయింది. జెయింట్ వీల్ క్యాబిన్ నుంచి బయటకు విసిరేయబడింది.
ఇది కూడా చదవండి : అధిక కోపం ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది?
అదృష్టవశాత్తు జాయ్‌రైడ్ రాడ్‌ను ఆమె పట్టుకున్నది. బాలిక భయంతో అరుస్తూ 60 అడుగుల ఎత్తులో ప్రమాదకరంగా వేలాడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ భారీ జెయింట్ వీల్ రైడ్ తర్వాత ఆగడంతో సడెన్ గా కుదుపులు ప్రారంభమైయ్యాయి. బాలిక బ్యాలెన్స్ తప్పింది. కూర్చొన్న సీటు నుంచి జారిపడింది. అయితే అదృష్టవశాత్తు జాయ్‌రైడ్ రాడ్‌ను ఆమె పట్టుకున్నది. భయంతో అరుస్తూ 60 అడుగుల ఎత్తు నుంచి ప్రమాదకరంగా వేలాడింది.
ఇది కూడా చదవండి : మరొక్క రోజే.. హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ ర్యాలీ.. అర్హులు ఎవరంటే?
బాలిక కిందకు చేరేంత వరకు వేలాడుతూనే ఉంది. మరోవైపు ఆ జెయింట్ వీల్‌ను మెల్లగా తిప్పి కిందకు చేర్చారు. దీంతో ఆ బాలిక సురక్షితంగా కిందకు దిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అధికారులు స్పందించారు. ఆ బాలికకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా భారీ జెయింట్ వీల్ ఏర్పాటు చేశారని అధికారులు నిర్వాహుకులపై యాంక్షన్ తీసుకుంటామన్నారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్