/rtv/media/media_files/2025/05/19/WLAbKJhU9cXpfPN5K1hO.jpg)
SC Classification Reservations to Implement on rajiv yuva vikasam Scheme
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే దీనికోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. అయితే తాజాగా ఈ స్కీమ్‌కు సంబంధించి మరో బిగ్ అపడేట్ వచ్చింది. ఇటీవల రాష్ట్రంలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read: రైతులకు బిగ్ షాక్.. వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు
Rajiv Yuva Vikasam
ఈ స్కీమ్ కోసం సామాజిక వర్గం నుంచి మొత్తం 44,800 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఈ పథకానికి ఆమోదించడం వల్ల మూడు ఉపకులాలకు 1,9,5 శాతంతో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఎస్సీ గ్రూప్ బీ నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే దరఖాస్తుల వారీగా లబ్ధిదారుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అర్హులైన వాళ్లని ఎంపిక చేయనున్నారు.
Also Read: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనిట్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇప్పటికే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం రాష్ట్ర సర్కార్ రూ.6 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా ఇటీవల ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందుల్లో ఎస్సీ ఏకు 1 శాతం, ఎస్సీ బీకి 5, ఎస్సీ సీకి 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. అయితే ఇప్పుడు రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు కూడా ఈ రిజర్వేషన్లను ఆమోదించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: పహల్గాంకు జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
telugu-news | Rajiv Yuva Vikasam | rtv-news | telangana