/rtv/media/media_files/2025/03/01/CQ4gjhEsXpKCCqjAIUr6.jpg)
Monalisa Bhonsle
యూపీలోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో జరిగిన మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) లో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. దీంతో ఆమెకు అటు సినిమా అవకాశాలు, ఇటు ప్రకటనల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఒక బహిరంగ వేదికపై జరిగిన ప్రదర్శనలోనూ పాల్గొంది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారిన వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే.. అప్పటినుంచి వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తీస్తున్న ది స్టోరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో కీలక పాత్రను దక్కించుకున్నప్పటి నుంచి మోనాలిసా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కోజికోడ్ జిల్లాలో ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లిన మోనాలిసాను చూసేందుకు అక్కడికి భారీగా జనం తరలిరావడంతో ఆమె క్రేజ్ ఎంత ఉందో అర్థం అయిపోయింది.
Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
Monalisa Bhosle Saying I Love You
ఈ క్రమంలోనే ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా ఆమె నేపాల్ పర్యటనకు వెళ్లారు.మహా శివరాత్రి పండగ వేళ.. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి.. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోనాలిసా (Monalisa Bhosle) పాల్గొంది. ఇక ఆ కార్యక్రమానికి స్థానికంగా భారీగా జనం తరలివచ్చారు. నేపాల్‌లోని మైలాపూర్‌లో నిర్వహించిన మహా శివరాత్రి ఉత్సవాల్లో ఆమె ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై మొదట ప్రసంగించిన మోనాలిసా.. ఈ క్రమంలోనే అంతా ఎలా ఉన్నారంటూ అడిగింది.
Also Read : అలెర్ట్.. ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్ !
ఆ తర్వాత ఐ లవ్ యూ అంటూ అక్కడికి వచ్చిన కుర్రకారును ఉత్సాహ పరిచింది. ఇక ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మోనాలిసా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇక ఆ వీడియోకు నెటిజన్ల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. చాలా మంది నెటిజన్లు.. ఆమె తొందర్లోనే గొప్ప స్థాయికి వెళ్లిందని కొనియాడుతున్నారు. ఆమె డ్యాన్స్ బాగా చేసిందని.. ఇంకా ఉన్నత స్థితికి వెళ్లాలని ఆకాంక్షించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోనాలిసాను అందరూ ప్రోత్సహించాలని పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read : మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా?
ఈ వీడియో ను చూసిన యూజర్స్ తమ ప్రదిస్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ‘చాలా బాగుంది. దీనినే కంటిన్యూ చేయండి’ అని రాయగా మరొకరు ‘చాలా బాగుంది మోనాలిసా.. విజయం నిన్ను ముద్దాడుతుంది’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘అక్కకు ఇలాంటి సపోర్ట్ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. కాగా మోనాలిసా పాల్గొన్న ఈ కార్యక్రమంలో డైరెర్టర్ సనోజ్ మిశ్రా కూడా పాల్గొన్నారు. ఆయనే మోనాలిసాకు తొలి సినిమా అవకాశం ఇచ్చారు. ఈవెంట్ ప్రారంభానికి ముందు మోనాలిసా ‘అందరికీ ఐ లవ్యూ’ అంటూ తన నృత్యాన్ని ప్రదర్శించింది.
Also read : SLBC: లోపల కార్మికులు బతికే ఉన్నారా? లేదా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన!