/rtv/media/media_files/2025/03/01/8wKFMSjN2FbU5Rj2WrCR.jpg)
Madhyapradesh drunk woman creates ruckus on road
Viral video: ఈ తరం యువతకు సోషల్ మీడియా స్టార్ పిచ్చి ముదిరిపోతుంది. రాత్రికి రాత్రే వైరల్ కావాలనే కోరికలతో ఎంతకైనా దిగజారిపోతున్నారు. ఎలాంటి రిస్క్ చేయడానికైనా వెనకాడట్లేదు. తాజాగా ఇలాంటి ఓ ప్రమాదకరమైన ఘనట మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఒకడు వెనకాల మరొకడు ముందు ఉన్నప్పటకీ మద్యం మత్తులో మూడో వాడికి ముద్దులు పెడుతున్న యువతి వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అయితే బైక్ స్టంట్ చేస్తూ ఇలా ప్రవర్తించగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తుండగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: వేసవి రాకముందే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి
#WATCH | भोपाल के VIP रोड पर 100 की रफ्तार से कानून रौंदते स्टंटबाज, कैमरे में कैद हुआ हैरान करने वाला नज़ारा
— Republic Bharat - रिपब्लिक भारत (@Republic_Bharat) March 1, 2025
.
.
.
. #MPVIRoad#StuntGoneWrong#RoadSafety#BikeStunt#TrafficRules#MadhyaPradesh#BreakingNews#RecklessDriving#DangerousStuntspic.twitter.com/2QUmUq4Ncv
మద్యం మత్తులో వీరంగం..
ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో మద్యం మత్తులో యువతీ యువకులు రోడ్లపై హంగామా చేశారు. ఒకే బైక్‌పై ఇద్దరు యువకుల మధ్య ఓ యువతి జర్నీ చేస్తూ రచ్చ చేసింది. బైక్ 60కి పైగా స్పీడ్ వెళ్తున్న క్రమంలో వారిద్దరి మధ్య నిలబడి రోడ్డుపై వెళ్తున్న వారికి ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చింది. ఈ ఘటనను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా యువతి ప్రవర్తనతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠినంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పలువురు పోలీసులు ఫిర్యాదు కూడా చేయగా మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ఇది కూడా చదవండి: ఈ పండు కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది