SLBC: డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!

టన్నెల్ లో చిక్కుకున్న ఆ 8 మంది అసలు బతికే అవకాశమే లేదని అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన చేశారు. ఓ వైద్యుడిగా తాను ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. చనిపోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం ఇస్తామన్నారు.

New Update
Chikkudu Vamshi Krishna MLA Accident

Chikkudu Vamshi Krishna MLA Accident

SLBC ప్రమాదంపై అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సంచలన విషయాలు ప్రకటించారు. కార్మికుల మృతి చెందినట్లు ఆయన ధ్రువీకరించారు. టన్నెల్ లో చిక్కుకున్న ఆ 8 మంది అసలు బతికే అవకాశమే లేదన్నారు. ఓ డాక్టర్‌గా ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. 8 మంది కార్మికుల కుటుంబాలు ఇక్కడే ఉన్నాయన్నారు. బాధలో ఉంటారని వారికి చనిపోయిన విషయం చెప్పట్లేదన్నారు. ఫార్మాలిటీస్ పూర్తికాగానే డెడ్‌బాడీలను బాధిత కుటుంబాలు అప్పగిస్తామన్నారు. రాత్రి వరకు రెస్క్యూ పూర్తి అవుతుందన్నారు. చనిపోయిన వారికి ప్రభుత్వం తరఫున కూడా పరిహారం ఇస్తామన్నారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. ప్రమాదంపై రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు