అలెర్ట్.. ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్ !

ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాలుష్య  నివారణకు  15 ఏళ్లు పై బడిన  వాహనాలకు మార్చి 31వ తేదీ తరువాత బంకుల్లో ఇంధనం సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం  వెల్లడించారు.

New Update
delhi petrol

ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాలుష్య  నివారణకు 15 ఏళ్లు పై బడిన  వాహనాలకు మార్చి 31వ తేదీ తరువాత  బంకుల్లో ఇంధనం సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని  పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం వెల్లడించారు.  అలాంటి వాహనాలను గుర్తించేందుకు బంకుల్లో  ప్రత్యేక పరికరాలను ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా ఈ ఏడాది చివరి నాటికి 90 శాతం సీఎన్ జీ బస్సులను తొలిగిస్తామని వాటి స్థానంలో  ఎలక్ట్రిక్ బస్సులను  తీసుకువస్తామని వెల్లడించింది.

యాంటీ-స్మోగ్ గన్‌లను ఏర్పాటు

15 ఏళ్ల నాటి వాహనాలను గుర్తించే బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని పర్యావరణ మంత్రి తెలిపారు. భారీ వాహనాలకు సంబంధించి, ఢిల్లీలోకి ఏ వాహనాలు ప్రవేశిస్తున్నాయో ముందుగా పరిశీలిస్తామన్నారు.  ఢిల్లీలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్ళు, వాణిజ్య సముదాయాలు వాయు కాలుష్య స్థాయిలను అరికట్టడానికి యాంటీ-స్మోగ్ గన్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గత ఆప్ ప్రభుత్వం దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఎటువంటి చర్య తీసుకోలేదని ఆయన విమర్శించారు.  

Also read :  Manipur: మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన.. అమిత్‌ షా కీలక ఆదేశాలు

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు