Salman Khan: సల్మాన్ ఖాన్ కు బిగ్ షాక్.. కోర్టు నోటీసులు!

బాలీవుడ్‌ స్టార్‌ హిరో సల్మాన్‌ ఖాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన ఓ పాన్‌ మసాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రకటన విషయంలో కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. స

New Update
BREAKING

BREAKING

బాలీవుడ్‌ స్టార్‌ హిరో సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన ఓ పాన్‌ మసాల కంపెనీ(pan-masala-adds)కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రకటన విషయంలో కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. సల్మాన్ ఖాన్‌ ప్రచారం చేసిన యాడ్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపిస్తూ రాజస్థాన్‌లో వినియోగదారుల కోర్టులో ఆయనపై ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్‌పై కోర్టు స్పందించింది. సల్మాన్‌ ఖాన్‌తో సహా ఆ పాన్‌ మసాల తయారీ సంస్థకు నోటీసులు పంపించింది.  

Also read: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు స్పాట్ డెడ్

Salman Khan Lands Legal Trouble Over Misleading Pan Masala Ad Claims

ఇక వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ సీనియర్ నాయకులు, రాజస్థాన్ హైకోర్టు న్యాయవాది ఇందర్ మోహన్ సింగ్ హానీ.. సల్మాన్‌ ఖాన్‌పై ఫిర్యాదు దాఖలు చేశారు. రాజశ్రీ పాన్‌ మసాలా ప్రకటనల్లో కుంకుమపువ్వు కలిపిన యాలకులు, కేసర్ కలిపిన పాన్‌ మసాల వంటి వాటిపై ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసర్ ధర కిలోకు రూ.4 లక్షలు ఉంది. కానీ రూ.5 కే అమ్మే పాన్‌ మసాల ప్యాకెట్‌లో కేసర్ ఉండటమేని అసాధ్యని అన్నారు. ఈ యాడ్ ద్వారా పాన్ మసాల కంపెనీ కంపెనీ, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాదించారు.    

Also Read: జమ్మూకాశ్మీర్ లో ఎదురు కాల్పులు..ఉగ్రవాదులను చుట్టుముట్టిన జవాన్లు

న్యాయవది ఇందర్‌ మోహన్ సింగ్ వాదనలు వినియోగదారుల కోర్టు సీరియస్‌గా తీసుకుంది. పాన్‌ మసాలా యాడ్‌లను వెంటనే నిషేధించాలని.. తప్పుడు సమాచారంతో కూడిన యాడ్‌లను నియంత్రించాలని కోరారు. ప్రస్తుతం సల్మా్న్‌ ఖాన్‌ గానీ రాజశ్రీ పాన్ మసాలా నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే కేసును తదుపరి విచారణను నవంబర్ 27కు కోర్టు వాయిదా వేసింది.