Sadhguru: వాళ్లని రాజకీయాల్లోకి లాక్కండి.. సద్గురు సంచలన పోస్ట్

అదానీ వ్యవహారంపై ఎలాగైన చర్చ జరపాలని విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఎక్స్‌ వేదికగా ఓ కీలక పోస్టు చేశారు. భారత్‌లో సంపద సృష్టించేవారు, ఉద్యోగాలు ఇచ్చేవారిని రాజకీయాల్లోకి లాక్కూడదని పేర్కొన్నారు.

New Update
Sadhguru

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గౌతమ్ అదానీపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అదానీ వ్యవహారం వల్ల విపక్షాల నిరసనలతో ఉభయసభల కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. సభలను వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తోంది. అదానీ వ్యవహారంపై ఎలాగైన చర్చ జరపాలని విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఎక్స్‌ వేదికగా ఓ కీలక పోస్టు చేశారు. 

Also read: తల దించుకోవాల్సి వస్తోంది.. పార్లమెంటులో నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Sadhguru On Parliament Disruptions

'' ఈ ప్రపంచంలోనే ఇండియా ప్రజాస్వామ్యానికి దీపస్తంభాంగా ఉండాలని కోరుతున్న క్రమంలో పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలగడం నిరుత్సాహపరుస్తోంది. భారత్‌లో సంపద సృష్టించేవారు, ఉద్యోగాలు ఇచ్చేవారిని రాజకీయాల్లోకి లాక్కూడదు. ఏమైనా తప్పులు జరిగిఉంటే చట్టప్రకారం చర్యలు ఉండాలి. కానీ రాజకీయంగా ఫుట్‌బాల్‌ ఆటగా మారకూడదు. భారత్‌ భవ్య భారత్‌గా మారాలంటే.. వ్యాపారులు వృద్ధి చెందడం ఒక్కటే మార్గమంటూ'' రాసుకొచ్చారు.  

Also Read :  Chess: యంగ్ తరంగ్ గుకేశ్ సంచలనం.. ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం

ఇదిలాఉండగా.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 20 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే అదానీ అంశంపై జరుగుతున్న ఆందోళనలకు టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీలు దూరంగా ఉంటున్నాయి. పార్లమెంటు ఉభయ సభల కార్యక్రమాలు ఎలా సాగాలో బీజేపీ, కాంగ్రెస్‌లో నిర్ణయిస్తున్నాయని టీఎంసీ పార్టీ అసంతృప్తి వ్యక్తంచేయడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు దేశాన్ని అస్థిరపరిచేందుకు బిలియనీర్‌ జార్జి సోరోస్‌కు కాంగ్రెస్ కుమ్మక్కై పనిచేస్తోందన్న బీజేపీ ఆరోపణలపై అలాగే అదానీపై చర్చ జరపాలని గురువారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో మళ్లీ లోక్‌సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. 

Also Read :  రూ.3.3 కోట్ల 1,100 సెల్‌ఫోన్లు స్వాధీనం.. బాధితులకు అందించిన పోలీసులు

Also Read: కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా..మోహన్ బాబు మరో ఆడియో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు