Hyderabad : హైదరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో చోరీకి గురైన సెల్ ఫోన్ కేసులను ఛేదించారు. నగరం పరిధిలో దొంగలపై పటిష్ఠ నిఘాపెట్టి చేపట్టిన ఆపరేషన్ లో ప్రజలు పోగొట్టుకున్న రూ.3.3 కోట్ల విలువైన 1,100 సెల్‌ఫోన్లను బాధితులకు అందించినట్లు సైబరాబాద్ డీసీపీ (క్రైం) కె.నరసింహ తెలిపారు. Also Read: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! 45 రోజుల్లోనే 1,100 ఫోన్లు స్వాధీనం.. ఈ మేరకు మీడియా సెల్‌ఫోన్ అందించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవడంలో సైబరాబాద్ కమిషనరేట్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. గత 45 రోజుల్లోనే 1,100 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫోన్లను బిహార్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కొరియర్, రైళ్లు, బస్సుల్లో తెప్పించేందుకు పోలీసులు చాలా శ్రమించారు" అని ఆయన తెలిపారు. ఇక చోరీ ఫోన్లు కొన్నా, దొంగిలించిన నేరమే అన్నారు. Also Read: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే! ఐఎంఈఐ నంబరు వివరాలతో ఫిర్యాదు.. అలాగే ఫోన్లు దొరికితే యజమానులు, పోలీసులకు అప్పగించాలని చెప్పారు. ఇక చోరీకి గురైన, పోగొట్టుకున్న సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్‌లో ఐఎంఈఐ నంబరు తదితర వివరాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో క్రైమ్స్ ఏసీపీ కళింగరావు, సీసీఎస్ ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు ప్రశాంత్, పవన్, రాజు తదితరులు పాల్గొన్నారు. Also Read: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ